'దక్షిణాది చిరపుంజీ'.. ఈ ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!
చిరపుంజీ గురించి మనం ఇప్పటికే విన్నాం. మేఘాలయా రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ లో ఈ ప్రాంతం ఉంది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా చిరపుంజీ నిలుస్తోంది. అయితే దక్షిణాది చిరపుంజీగా పేరుగాంచిన ప్రదేశం మీకు తెలుసా..? చిరపుంజీ అనుభూతిని పర్యటకులకు ఈ ప్రాంతం కలిగిస్తోంది. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం సహజ సౌందర్యం గురించి ఎంత చెప్పినా త "దక్షిణాది చిరపుంజీ" అని పిలవబడే ఈ ప్రాతం కర్ణాటకలోని 'అగుంబే' లో ఉంది. అగుంబే ఘాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చని ప్రకృతి సోయగాలు, సుందరమైన జలపాతాలు ఎంతో ప్రత్యేకమైనవి.
కర్ణాటకలోని చిన్న గ్రామమైన అగుంబే ఇప్పుడు పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతానికి దక్షిణాది చిరపుంజీ అని పేరుంది. ఎప్పుడూ ఇక్కడ వర్షం పడుతూ ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం కన్నుల విందుగా.. చూపు తిప్పుకోనివ్వకుండా ఉంటుంది. సముద్రమట్టానికి 2 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకుల కోసం ఇక్కడి కొండలపై చిన్న చిన్న ఇళ్లను కూడా నిర్మించారు. అగుంబేలో సూర్యాస్తమయం దృశ్యాలు ఆకట్టుకుంటాయని చెబుతారు.
ఇక్కడ రెండు సుందరమైన జలపాతాలు ఉన్నాయి. జోగిగుండి, కూడ్లు.. పచ్చని అడవులు.. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారే జలాపాతాలు పర్యటకులను ఎనలేని అనుభూతిని కలిగిస్తోంది. అలాగే ఈ ప్రాంతంలో శృంగేరీ శారదా ఆలయంతో పాటు మరో జైన మందిరం కూడా ఉంది. అంతేకాక ట్రెక్కింగ్ ఇష్టపడేవారికి ఇక్కడ కుందా హిల్స్ లో ఆ సౌకర్యం ఏర్పాటు చేశారు. యువత ఈ కొండలపై వాకింగ్, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు.

ఇక అగుంబే ప్రాంతానికి చేరుకోవాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనువైనవిగా చెబుతారు. అగుంబే ప్రాంతానికి దగ్గరలో మంగళూరు రైల్వే స్టేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్టేషన్ కు డైరెక్ట్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంగళూరుకు రైళ్లు ఉన్నాయి. అలాగే మంగళురు ఎయిర్ పోర్టు కూడా ఉంది. షిమోగ, ఉడిపి రైల్వే స్టేషన్ లు కూడా అగుంబే ప్రాంతానికి దగ్గర్లో ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరు నుంచి అగుంబే కు బస్సు సౌకర్యం కూడా ఉంది.












Click it and Unblock the Notifications