కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్: ఇద్దరు పైలట్లు మృతి, ముఖ్యమంత్రి సంతాపం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. రాయ్‌పూర్‌లోని విమానాశ్రయంలో గురువారం రాష్ట్ర హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం.. పైలట్లు హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్లు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు సీఎం భూపేశ్ బఘేల్. "రాయ్‌పూర్‌లోని విమానాశ్రయంలో రాష్ట్ర హెలికాప్టర్ కూలిపోవడం గురించి ఇప్పుడే ఒక విచారకరమైన వార్త వచ్చింది. ఈ విషాద ప్రమాదంలో, మా పైలట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ ఇద్దరూ మరణించారు. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం.. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన రాత్రి 9:10 గంటల సమయంలో జరిగిందని, ఈ ఘటన మానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్‌లకు తీవ్ర గాయాలయ్యారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని ఎస్ఎస్సీ తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications