కొరఢా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్: ఎందుకంటే..?(వీడియో)
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కొరఢా దెబ్బలు తిన్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొరఢా దెబ్బలు ఎందుకు తిన్నారు? ఆయనను కొట్టేదెవరు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే. కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆచారం మేరకు ఆయన ఓ వ్యక్తి చేతిలో కొరఢా దెబ్బలు తిన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దీపావళి మరుసటి రోజు గోవర్ధన్ పూజ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దుర్గ్ జిల్లాలోని జజన్‌గిరి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పండగ రోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరఢా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.

రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కూడా జజన్‌గిరి గ్రామానికి వెళ్లి ఈ పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కొరడా దెబ్బలు తిన్నారు. బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి సీఎం చేతిపై ఎనిమిది సార్లు కొరడాతో కొట్టారు. ఆ తర్వాత సీఎంకు నమస్కరించి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई।
— Bhupesh Baghel (@bhupeshbaghel) November 5, 2021
सभी विघ्नों का नाश हो। pic.twitter.com/bHQNFIFzGv
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబబ్ల సంప్రదాయంలో పాల్గొన్నానని, విఘ్నాలు తొలగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా గోవర్ధన్ పూజ రోజున గోమాతకు పూజలు చేస్తుంటారు. గోవులు ఎంత సుభిక్షింగా ఉంటే రాష్ట్రం అంత సమృద్ధిగా ఉంటుందని సీఎం భగేల్ ఈ సందర్భంగా తెలిపారు. గత సంవత్సరం కూడా ఈ పూజలో పాల్గొని కొరఢా దెబ్బలు తిన్నారు సీఎం భూపేశ్ భగేల్.












Click it and Unblock the Notifications