ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్... మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం...
ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్ర నేత జోగా హతమయ్యారు. మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్ హోదాలో జోగా పనిచేస్తున్నారు.
దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగ్నర్ ప్రాంతంలో మావో కదలికలపై ఇంటలిజెన్స్ టీమ్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బస్తర్ జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ),సీఆర్పీఎఫ్ దళాలు రంగంలోకి దిగి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం(జూన్ 30) ఉదయం 8.30గంటల సమయంలో భద్రతా బలగాలకు,మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

దాదాపు 45 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా మావోయిస్టు అగ్ర నేత జోగా మృతదేహాన్ని గుర్తించారు. జోగా పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై భారీ క్యాష్ రివార్డు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పిస్టల్,303 రైఫిల్,వైర్‌లెస్ సెట్,మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
బస్తర్ అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అక్కడి సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ దీపక్ ఝా తెలిపారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ... జూన్ నెలలో మొత్తం ఏడుగురు సీనియర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత వానా కాలంలోనూ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవలి కాలంలో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు చేసిన దాడిలో 22 మంది జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భద్రతా బలగాలు మావోయిస్టులపై మరింత ఫోకస్ పెట్టాయి.ఎక్కడ ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications