చిట్‌ఫండ్ స్కాంలో మాజీ సీఎం కొడుకు..
అంబికాపూర్ : ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓ చిట్ ఫండ్ స్కాంలో అతనితో పాటు మరో 19 మందిపై కేసు నమోదైంది. మాజీ సీఎం కుమారుడితో పాటు బీజేపీ మాజీ ఎంపీ మధుసూదన్ యాదవ్, కాంగ్రెస్ నేత నరేష్ దకాలియాలపై సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
కస్టమర్లను నిండా ముంచి బిచాణా ఎత్తివేసిన చిట్ ఫండ్ కంపెనీకి అభిషేక్, మధుసూదన్, దకాలియాలు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించి లక్షల రూపాయలు వసూలు చేసిన సంస్థ 2016లో మూతపడింది. దీనిపై చిట్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్, ఏజెంట్‌గా పనిచేసిన ప్రేమ్ సాగర్ గుప్తా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులపై కేసు నమోదుచేయాలని ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వుల మేరకు అంబికాపూర్ పోలీసులు రమణ్ సింగ్ కొడుకు అభిషేక్, మధుసూదన్, దకాలియాతో పాటు 17 మంది అన్‌మోల్ ఇండియా కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదుచేసింది. ఐపీసీలోని సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 34 (కామన్ ఇంటెన్షన్)లతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2005లోని పలు సెక్షన్లు కింద కేసు బుక్ చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications