ఛత్తీస్‌గఢ్ గవర్నర్ టాండన్ కన్నుమూత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్(90) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస శ్వాస విడిచారు.
మంగళవారం ఉదయం టాండన్ ఆరోగ్యం క్షీణించడంతో రాయ్‌పూర్‌లోని అంబేద్కర్ ఆస్పత్రికి తరలించినట్లు రాష్ట్ర రాజ్ భవన్ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

బలరామ్‌జీ దాస్ టాండన్ నవంబర్ 1, 1927న జన్మించారు. యువకుడిగా ఉన్న సయంలో రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 1969-70కాలంలో ఆయన పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జులై 25, 2014 నుంచి ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications