దారుణం: కాపురానికి అడ్డొస్తున్నారని మేనకోడలు, మేనల్లుడి సజీవ దహనం

రాయ్‌పూర్: తమ కాపురానికి అడ్డుగా ఉన్నారని కొత్తగా పెళ్లయిన ఓ జంట తమ మేనకోడలు, మేనల్లుడును సజీవంగా దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్డీ టీవీ కథనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిందితులు డోమెయిన్, మాలతిలకు వివాహం జరిగింది. తమ కాపురానికి అడ్డుగా ఉన్నారని భావించిన ఈ దుర్మార్గపు దంపతులు.. ఇంట్లో ఉన్న మేనల్లుడు మోహన్(3), మేనకోడలు భువనేశ్వరి(6)లకు నిప్పుపెట్టి సజీవదహనం చేశారు.

కాగా, మృతుల తల్లి రేణుక మంగళవారం ఉదయం క్వారీలో పని నిమిత్తం వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి చిన్నారులు మృతి చెంది ఉన్నారు. దీంతో తీవ్రంగా విలపించింది. మాలతి దంపతులే తన పిల్లలను చంపారని రేణుక ఆరోపించింది.

Chhattisgarh shocker: Newly wed couple burn nephew, niece alive for disturbing their privacy

‘నేను నా పెద్ద కూతురును తీసుకుని మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్లాం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు శవాలుగా పడివున్నారు. నా కొడుకు చాలా అమాయకుడు. ఈ హత్యలకు నా కోడలే కారణం' అని మృతుల అమ్మమ్మ గంగోత్రి ఓజా మీడియాకు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ‘నాకు ఆ పిల్లలంటే మొదటి నుంచి ఇష్టం లేదు. నన్ను నీచంగా చేశారు. నాకు, నా భర్తకు వారి వల్ల ప్రైవసీ లేకుండా పోయింది. అందుకే వారిని నేను సజీవంగా దహనం చేశాను' అని నిందితురాలు మాలతి తన నేరాన్ని అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+