చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేరుగా ఎదుర్కొండి: ఐటీ, ఈడీ సోదాలపై చిదంబరం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తన కుటుంబాన్ని టార్గెట్ చేయాలనుకుంటే నేరుగానే ఎదుర్కొవచ్చని కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం అన్నారు. తన కుమారుడు కార్తీ చిదంబరం సంస్థలపై ఐటీ, ఈడీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అవి కేంద్రం చేపట్టిన మోసపూరిత దాడులుగా ఆయన పేర్కొన్నారు.

ఈడీ తనిఖీలపై చిదంబరం మంగళవారం స్పందించారు. ప్రభుత్వం నన్ను లక్ష్యంగా చేయదలచుకుంటే డైరెక్ట్‌గానే చేయొచ్చు. అంతేకాని నా కుమారుడితో వ్యాపార సంబంధాలు ఉన్న అతని స్నేహితులను కాదు. రాజకీయాలతో వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ దాడులను ఎదుర్కొనేందుకు తాను, తన కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం ఆదాయపన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

అతనితో పాటు అతడి స్నేహితుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. 2జీ కుంభకోణంలో భాగంగా ఎయిర్‌సెల్-మ్యాక్సిక్ ఒప్పందానికి సంబంధించి జరిగిన అవకతవకల్లో కార్తీ చిదంబరం ప్రమేయముందని కేసు నమోదైన సంగతి తెలిసిందే.

 Chidambaram hits out at ED after raids on firms linked to son

English summary
Former Finance Minister P. Chidambaram has lashed out at the Enforcement Directorate and accused it of implementing the agenda of the Government after officials raided the firms allegedly linked to his son, Karti Chidambaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X