Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదన

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను సీబీఐ విచారించినట్లు సమాచారం. ఆ తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టింది.

సుదీర్ఘమైన కేసు కావడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమకు మరింత సమయం కావాలని, అందుకు చిదంబరంను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ.. కోర్టులో వాదనలు వినిపిస్తోంది. ఈ కేసులో చిదంబరంపై బలమైన అభియోగాలున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరపున వాదించారు.

 Chidambaram Produced in Court, CBI Seeks 5-da

ఇక చిదంబరం తరపు న్యాయవాదులు మాత్రం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. చిదంబరం, కార్తీ చిదంబరం తరపున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ, వివేక్ తంఖాలు వాదనలు వినిపిస్తున్నారు.

కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలాఉండగా, కోర్టు రూంలో కార్తీ చిదంబరం భార్య నళిని, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. దయన్ కృష్ణన్ తోపాటు ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా కోర్టు రూంలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+