తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..!

తమిళనాడు (tamil nadu), పశ్చిమ బెంగాల్లో (west bengal) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు సహా అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల వేళ విపక్ష ఎంపీలు లేకుండా పార్లమెంట్ ఎలా నడుపుతారని విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి చిదంబరం (chidambaram)కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. ఏప్రిల్ 16-18 తేదీలలో పార్లమెంటును సమావేశపరచాలన్న ప్రతిపాదన దురుద్దేశపూరితమైనదని, దీనిని తప్పక వ్యతిరేకించాలని చిదంబరం పిలుపునిచ్చారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఏప్రిల్ 23న (పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 29న రెండోదశ) పోలింగ్ జరగనుంది.

Chidambaram Slams Parliament Session Timed to Bar TN WB Opposition MPs from Voting on Key Bills

లోక్‌సభలో ప్రతిపక్ష బెంచీలలో తమిళనాడుకు చెందిన 39 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 28 మంది ఎంపీలు ఉన్నారని, ఏప్రిల్ 16-18 తేదీలలో వారు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారని చిదంబరం గుర్తుచేశారు. ఆ తేదీలలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను చర్చకు, ఓటింగ్‌కు తీసుకువస్తే, లోక్‌సభలోని ఈ 67 మంది ఎంపీలు ఎలా పాల్గొని ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎంపీలను మినహాయించడమే దీని వెనుక ఉన్న కుట్ర అని తాను అనుమానిస్తున్నట్లు చిదంబరం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+