వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు..కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఒక ముఖ్యమైన నిర్ణయం వక్ఫ్ బోర్డు రద్దు. అనేక దశాబ్ధాలుగా ముస్లింలు దీనిని పాటిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రద్దు చేయటం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పటికీ అనేక చోట్ల దీనిపై ముస్లిం మతపెద్దలు పోరాడుతున్నారు. ఉన్నత న్యాయస్థానంలో కూడా వక్ఫ్ చట్టం రద్దుపై వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం రద్దుపై తన వాదనలు వినిపించింది. వక్ఫ్ బోర్డు కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ అని, ఇది అసలు ఇస్లాంలో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం వెల్లడించింది. రెండోరోజు వక్ఫ్ చట్టం రద్దుపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపింది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే కానీ ఇస్లాంలో భాగం కాదని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

దానధర్మాల వ్యవస్థ అన్ని మతాల్లోనూ ఉందని ఈ సందర్భంగా తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. హిందువులు, సిక్కులు మాదిరిగానే ముస్లింలకు వక్ఫ్ అనేది దానధర్మాలకు చెప్పబడిన వ్యవస్థగా ఆయన పేర్కొన్నారు. వివాదాస్పదమైన 'waqf by user' నిబంధన కింద వక్ఫ్‌గా ప్రకటించబడిన ఆస్తులను తిరిగి పొందే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సొలిసిటర్ జనరల్ వాదించారు. ఇది ప్రాథమిక హక్కు కాదని.. హక్కును చట్టం ద్వారా వెనక్కి ఎప్పుడైనా తీసుకోవచ్చని సుప్రీం కోర్టుకు తెలిపారు.
వాస్తవానికి ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు ఉండదని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని లేదా స్థలాన్ని వక్ఫ్ గా ప్రకటించబడితే దానిని కాపాడుకునే హక్కు ప్రభుత్వం వద్ద ఉంటుందని ధర్మాసనానికి వెల్లడించారు. అధికారిక డాక్యుమెంటేషన్ లేకుండా కూడా, మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ఉపయోగం ఆధారంగా ఆస్తిని వక్ఫ్‌గా గుర్తించే విధానం సరైనది కాదని ఈ సందర్భంగా తన వాదనల్లో తుషార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications