వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిండే టైం వచ్చింది - సభలో బల నిరూపణ : అసెంబ్లీ ప్రత్యేక భేటీ - ప్రధాని అభినందనలు..!!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో పది రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా అనూహ్యంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే ప్రమాణ స్వీకారం చేసారు. ఊహించని విధంగా మాజీ సీఎం..బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసారు. ఇక, ఇప్పుడు షిండే సీఎంగా బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. తనకు ఉన్న మద్దతును శాసనసభలో నిరూపించుకొనేందుకు గవర్నర్ ఆదేశించారు. ఇందు కోసం ఈ నెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Recommended Video

షిండే టైం వచ్చింది,సభలో బల నిరూపణ… ప్రధాని అభినందనలు *Politics || Telugu OneIndia
షిండే - ఫడ్నవీస్ కు ప్రధాని అభినందనలు

షిండే - ఫడ్నవీస్ కు ప్రధాని అభినందనలు


మరో వైపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన షిండేకు ప్రధాని మోదీ మొదలు బీజేపీ ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచి షిండే కు ప్రజా సమస్యలతో పాటుగా పాలనా - రాజ్యంగ వ్యవహారాల పైన పట్టు ఉందని..మహారాష్ట్రను ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లటానికి షిండే ప్రయత్నిస్తారని ప్రధాని ఆకాంక్షించారు. అదే విధంగా గతంలో సీఎంగా పని చేసి..ఇప్పుడు అధినాయకత్వం ఆదేశాల మేరకు చివరి నిమిషంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ను సైతం ప్రధాని ప్రశంసించారు. ఫడ్నవీస్ ప్రతీ బీజేపీ కార్యకర్తకు స్పూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు. ఆయన అనుభవం ప్రభుత్వానికి కలిసి వస్తుందన్నారు. మహారాష్ట్ర డెవలప్ మెంట్ లో ఈ ఇద్దరూ అంచనాలకు తగినట్లుగా పని చేస్తారని ఆశించారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల వేదికగా

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల వేదికగా

ఇదే సమయంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. సీఎంగా షిండే ఎంపిక.. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఎంపిక .. ఈ నిర్ణయాల వెనుక చోటు చేసుకున్న పరిణామాలతో పాటుగా శివసేనకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం పైన శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక.. రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలుత స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. శివసేన కు బీజేపీ మద్దతు ఇప్పుడు కీలకంగా మారటంతో స్పీకర్ స్థానం శివసేనకు ఇస్తారా లేక బీజేపీ తీసుకుంటుందా అనేది చూడాలి. ఇక, శాసనసభలో షిండే తన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. శివసేనకు చెందిన 49 మంది ఎమ్మెల్యేల మద్దతు షిండేకు ఉంది.

స్పీకర్ ఎన్నిక - బల నిరూపణ

స్పీకర్ ఎన్నిక - బల నిరూపణ

అదే విధంగా బీజేపీ కి చెందిన 106 మంది ఎమ్మెల్యేల మద్దతు సైతం షిండే కు ఉందంటూ ఆ పార్టీ ఇప్పటికే గవర్నర్ కు లేఖ ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్ధులు సైతం మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో..శాసన సభలో షిండే మెజార్టీ నిరూపణ లాంఛనంగా మారనుంది. సభలో బల నిరూపణ పూర్తయిన తరువాత వచ్చే వారంలోనే షిండే తన కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు దాదాపుగా మంత్రులుగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయటంతో.. కేబినెట్ లో బీజేపీ నుంచి మరి కొందరు మంత్రులుగా ఉంటారా..లేక, ఫడ్నవీస్ వరకు మాత్రమే పరిమితం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ సమావేశాల్లో షిండే బల నిరూపణ ద్వారా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసినట్లే.

English summary
Special Session Of Maharashtra Assembly On July 2 and 3, On the first day of the Assembly session, the Speaker elections will be completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X