ఆర్ కే నగర్ ప్రచారానికి తెర: జయ గెలుపు గ్యారంటీ
చెన్నయ్: చెన్నయ్ నగరంలోని ఆర్ కే నగర్ లో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఎవ్వరు ఎన్నికల ప్రచారం చెయ్యరాదని ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు.
చెన్నయ్ లోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ బరిలో ఉన్నారు. వీరు కాకుండా 26 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులలో కొందరు తెలుగు వారు కూడా ఉన్నారు.
జయలలిత, మహేంద్రన్ ల మద్య గట్టిపోటి ఉంది. ఈ నెల 22వ తేదిన ఆర్ కే నగర్ నియోజక వర్గంలో జయలలిత సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. ఈ నియోజక వర్గంలో ఎవరు గెలవాలన్నా అక్కడ నివాసం ఉంటున్న తెలుగు ఓటర్లు తీర్పు చెప్పాలి.

ఆన్నా డీఎంకే పార్టీలో ఉన్న 50 మంది తెలుగు ప్రముఖులతో గురువారం ప్రచారం నిర్వహించారు. అమ్మ గెలిస్తే తెలుగు వారు గెలిచినట్లే అని ప్రచారం చేస్తున్నారు. వారిలో సినీ రంగంలో ఉన్న కొందరు ప్రచారం చేపట్టారు.
ఆర్ కే నగర్ లో ప్రచారం చేస్తున్న వారు సాయంత్రం 5 గంటలకు అక్కడి నుండి వెళ్లిపోవాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు గట్టి బందో బస్తు ఎర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదిన పోలింగ్ జరగనుంది. చెన్నయ్ లో ఆ రోజు సెలవు ప్రకటించారు.
ఈనెల 30 వ తేది ఓట్ల లెక్కింపు జరగనుంది. జయలలిత గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లు ఉంది. బుధవారం రూ. రెండు కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మిలటరి బలగాలను రంగంలోకి దింపారు. 1,150 మంది ఎన్నికల సిబ్బందితో పాటు ఫ్లైయింగ్ స్వ్కాడ్ లు పని చేయ్యడానికి ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications