ఎస్ఎస్ రాజమౌళి ఈగ ఫేం సుదీప్ కు అరెస్టు వారెంట్ జారీ, షూటింగ్ సమయంలో ఆస్తి నష్టం !
బెంగళూరు: ప్రముఖ బహుబాష నటుడు, ఎస్ఎస్ రాజమౌళి ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ కు అరెస్టు వారెంట్ జారి అయ్యింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా కాలం గడుపుతున్న సుదీప్ కు కర్ణాటకలోని చిక్కమగళూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూర్ అనే వ్యాపారి హీరో సుదీప్ మీద ఫిర్యాదు చెయ్యడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. సుదీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో వారస్ధారా (వారసుడు) అనే సీరియల్ నిర్మించారు. ఈ టీవీ సీరియల్ షూటింగ్ కోసం సుదీప్ చిక్కమగళూరులోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు.

కిచ్చ క్రియేషన్స్ నిర్మించిన ఈ సీరియల్ షూటింగ్ కోసం సుదీప్ చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూరు అనే వ్యక్తికి చెందిన ఇల్లు, కాఫీ తోటను అద్దెకు తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇల్లు, ఫాం హౌస్ ద్వంసం అయ్యిందని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు.
ఇల్లు, కాఫీ తోట దెబ్బతినిందని, నష్ట ఫరిహారంగా రూ. 1.50 కోట్లు చెల్లించాలని సుదీప్ కు ఎన్నిసార్లు మనవి చేసినా ఆయన పట్టించుకోలేదని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాలని తాను చేసిన మనవిని కిచ్చి క్రియేషన్ తిరస్కరించిందని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని దీపక్ మయూర్ తెలిపారు.












Click it and Unblock the Notifications