ప్రధాని మోడీ, అమిత్ షా ఎఫెక్ట్: కర్ణాటక మలెనాడులో కాంగ్రెస్ కు భారీ దెబ్బ, సిట్టింగ్ ఎమ్మెల్యే!
బెంగళూరు: కర్ణాటక మలేనాడు, కాఫీతోటలకు నిలయం అయిన చిక్కమగళూరు జిల్లాలో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించింది. చిక్కమగళూరు జిల్లాలోని ఐదు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసిన బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించింది.

కర్ణాటక గాంధీ
కర్ణాటక గాంధీగా పేరు తెచ్చుకుని అతి సామాన్య జీవితం గడుపుతూ విదాన సౌధకు ఆటోలో, ఆర్టీసీ బస్సుల్లో తిరిగే జేడీఎస్ పార్టీ నేత, కడూరు ఎమ్మెల్యే వైఎస్.వి దత్తా ఈ ఎన్నికల్లో ఓటమిపాలైనారు. చిక్కమగళూరు జిల్లాలో మే 12 జరిగిన శాసన సభ ఎన్నికల్లో కుల రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

కులాలు, మతాలు
ఒక్కలిగ, లింగాయత్ కులస్తుల ఓట్లు చీల్చడంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విఫలం అయ్యాయి. చిక్కమగళూరు జిల్లాలో ఒక్కలిగ, లింగాయత్, బిల్లద, బ్రాహ్మాణ, ఒంటి, ముస్లీం, క్రైస్తవ, జైన్ మతస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే 2013 శాసన సభ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఫలితాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.

శృంగేరి కాంగ్రెస్ దెబ్బ
చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే డీఎన్. జీవరాజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిడి. రాజేగౌడ చేతిలో ఓడిపోయారు. చిక్కమగళూరులోని మిగిలిన నాలుగు శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.

నాలుగు సీట్లు
మూడిగెరెలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మోటమ్మ మీద ఎంపీ. కుమారస్వామి, చిక్కమగళూరులో కాంగ్రెస్ పార్టీ లీడర్ బీఎల్. శంకర్ మీద సీటీ రవి, తరికెరేలో స్వతంత్రపార్టీ అభ్యర్థి జీహెచ్. శ్రీనివాస్ మీద బీజేపీ లీడర్ డీఎస్. సురేష్, కడూరులో జేడీఎస్ ఎమ్మెల్యే వైఎస్ వీ. దత్తా మీద బెళ్లి ప్రకాష్, శృంగేరీలో బీజేపీ అభ్యర్థి డీఎన్. జీవరాజ్ మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ టీడీ. రాజేగౌడ విజయం సాధించారు.

మోడీ, అమిత్ షా
చిక్కమగళూరు జిల్లాలోని ఐదు శాసన సభ నియోజక వర్గాల్లోని నాలుగు శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసినప ప్రచారంతో చిక్కమగలూరు జిల్లాలో బీజేపీ ఊహించినదానికంటే ఒక్కసీటు తగ్గిపోయింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications