
viral video:అన్న లేక తల్లడిల్లిన చిన్నారి తమ్ముడు.. కూర్చొబెట్టడంతో కూల్
అన్నదమ్ముల అనుబంధం అంటే మాటల్లో చెప్పలేం. కొందరు స్నేహితులు మాదిరిగానే ఉంటారు. మరికొందరు అయితే కొంచెం దూరం ఉంటారు. ఇక చిన్నప్పుడు అయితే కలిసి మెలిసి ఉంటారు. అన్నదమ్ముల మధ్య రిలేషన్ షిప్ అలా ఉంటుంది. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ కిస్ డే.. ఆ సందర్భంగా ఓ ఇద్దరు చిన్నారులు ముద్దుగా ఉండి.. ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

ఏడ్చిన చిన్నారి..
ద మాంటే ష్యామిలీ సూనేతో గత నెల 17వ తేదీన వీడియో షేర్ చేశారు. అందులో ఇద్దరు చిన్నారులు ఎగ్జిబిషన్‌లో కారు ఎక్కారు. దానిని తిప్పుతుండగా.. ఇద్దరు చిన్నారులు చెరో చోట కూర్చొన్నారు. ఇంకేముంది చిన్నొడు భయపడ్డాడు. ఏడవడం ప్రారంభించాడు. ఆ ఆపరేటర్ సిబ్బంది వెంటనే దానిని ఆపి వేశారు. తన అన్న వద్ద కూర్చొబెట్టాడు. ఇంకేముంది.. అతను చక్కగా ఉన్నాడు. అతను ఏడుపు ఆపివేశాడు.

2.5 లక్షల సార్లు చూసి..
వీడియోను ఇప్పటికే 2.5 లక్షల సార్లు చూశారు. 13 వేల లైకులు వచ్చాయి. ఆ వెంటనే తన తమ్ముడి భుజంపై చేయి వేశాడు. చెంపపై ముద్దు పెట్టుకుని ఓదార్చాడు. అతను చాలా మంచి చేశాడని.. మంచి అన్న అని ఒకరు కామెంట్ చేశారు. స్వీట్ బ్రదర్.. అలాగే ఆపరేటర్ కూడా వెంటనే స్పందించారని పేర్కొన్నారు. చాలా మంది చిన్నారి అన్నను కాపాడారు.

ముద్దుగా చిన్నారులు
వీడియో తెగ వైరల్ అవుతుంది. తన అన్న దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నారి ఏడవడం ఆపేశాడు. తర్వాత మెల్లగా నవ్వడం ప్రారంభించాడు. భుజం మీద చేయి వేసి ఇద్దరు కలిసి తిరిగారు. తాను ఒక్కరినే కూర్చొలేదని.. అతని చిన్న తమ్ముడు ఏడ్చి మరీ చెప్పాడు. ఆ వీడియో చాలా ముద్దుగా ఉంది. ఇద్దరు పిల్లలు కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు.