వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో: 50 శాతం పెరిగిన బాల్య వివాహాలు.. ఒక్క ఏడాదిలో.. కారణాలివే..

|
Google Oneindia TeluguNews

బాల్య వివాహాలు చేయొద్దని చెబుతోన్న వినిపించుకోవడం లేదు. దీంతో వారి జీవితంపై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. తీరు మార్చుకోవాలని సజెస్ట్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల మార్పు రావడం లేదు. యధేచ్చగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020లో జరిగిన బాల్య వివాహాల డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అంతేకాదు కిందటి ఏడాదితో పోలిస్తే 50 శాతం కేసులు పెరిగాయనే ఆందోళన కలిగించే అంశాన్ని తెలియజేసింది

2020లో ఇలా..

2020లో ఇలా..

2020లో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 785 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో కర్ణాటకలో ఎక్కువ కేసులు వచ్చాయి. అత్యధికంగా 184 కేసులు రికార్డయ్యాయి. అసోంలో 138, పశ్చిమ బెంగాల్ 98, తమిళనాడు 77, తెలంగాణలో 62 బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహ చట్టం ప్రకారం దేశంలో 18 ఏళ్ల లోపు యువతులు, 21 ఏళ్ల లోపు యువకులకు పెళ్లి చేయడం నేరం.

దేశంలో బాల్య వివాహాలు పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయని సాన్‌జొగ్ ఎన్జీవో సంస్థ వ్యవస్థాపక సభ్యుడు రూప్ సేన్ తెలిపారు. యవ్వన వయసులో ఉన్న బాలికలు ప్రేమలో పడటం కారణం అని చెప్పారు. పారిపోవడం, పెళ్లి చేసుకోవడంతో బాల్య వివాహాలు తప్పడం లేదు.

పరిస్థితులివే..

పరిస్థితులివే..

స్థానిక పరిస్థితుల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అడ్వకేట్ కౌశిక్ గుప్తా వివరించారు. అయితే పంచాయతీ/ లోకల్ బాడీ ఇదివరకటి కన్నా మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించారు. చైల్డ్ మ్యారేజ్‌కు సంబంధించి వారు రిపోర్ట్ చేస్తున్నారని తెలియజేశారు. కరోనా కాలంలోనే బాల్య వివాహాలు పెరిగాయని అనిదిత్ రాయ్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా మురికివాడల్లో ఆ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. గ్రామల్లో మాత్రం కాస్త మెరుగ్గా పరిస్థితి ఉందని తెలిపారు.

కరోనా కూడా..

కరోనా కూడా..

మురికివాడల్లో బాల్య వివాహాలు జరగడానికి గల కారణాలను చౌదరి వివరించారు. కరోనా వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీంతో తమ పిల్ల పారిపోతే.. ఒకరికీ అన్నం పెట్టే పరిస్థితి ఉండదని వివరించారు. బాల్య వివాహాల వల్ల విద్య ఆగిపోతుందని.. జీవిత కాలం తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో శారీరకంగానే కాదు మానసికంగా కూడా కుంగిపోతారని చెప్పారు. 2019లో 523 బాల్య వివాహాలు నమోదు కాగా.. 2018లో 501 కేసులు ఉండేవి. 2017లో 395, 2016లో 326, 2015లో 293 కేసులు ఉండేవి.

Recommended Video

సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
పారిపోయినా..

పారిపోయినా..

కరోనా కూడా బాల్య వివాహాలకు కారణం అవుతోంది. వైరస్ వల్ల అందరికీ అన్నం పెట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో యువతులు పారిపోయిన పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇదీ కూడా ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. వైరస్ వల్ల మార్కెట్ కూడా అనుకున్నంతగా లేకపోయింది.

English summary
child marriages increased by 50% in comparison to the previous year National Crime Records Bureau data revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X