వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Children: ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరెంట్ కట్, ఎంతమంది ప్రాణాలు పోయాయంటే ? !

|
Google Oneindia TeluguNews

రాయపూర్/ఛత్తీస్ గఢ్: ఒక చిన్న పొరపాటు, నిర్లక్షం నిండుప్రాణాలు బలి తీసుకుంటుందని పెద్దలు చెప్పిన మాట మరోసారి నిజయం అయ్యింది. అధికారులు చేసిన చినపొరపాటు, నిర్లక్షం కారణంగా ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అప్పుడు అధికారులు కళ్లు తెరిచారు. ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు సక్రమంగా పని చెయ్యకపోవడంతో చిన్నారుల ప్రాణాలు పోయాయి.

Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?

 ప్రభుత్వ మెడికల్ కాలేజ్

ప్రభుత్వ మెడికల్ కాలేజ్

ఆసుపత్రిలో చిన్నారుల ప్రాణాలు నిలుస్తాయని ఆసుపత్రికి వెళ్లిన తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలు పోవడంతో ఆర్తనాదాలు చేశారు. ఛత్తిస్ గఢ్ రాజధాని రాయపూర్ (రాయపుర)కు సుమారు 300 కిలో మీటర్ల దూరంోని అంబికాపురలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి చాలా పెద్దది.

 విద్యుత్ సరఫరా కట్

విద్యుత్ సరఫరా కట్

స్థానికంగా, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలు అంబికాపురలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇదే ఆసుపత్రిలో చిన్నపిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఉదయం 5.30 గంటల సమయంలో ఆసుపత్రికి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 10 నిమిషాలు అంటే ఎక్కువ

10 నిమిషాలు అంటే ఎక్కువ

మామూలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాల్లో మళ్లీ విద్యుత్ సరఫరా అవుతుందని సమాచారం. అయితే సుమారు 4 గంటలకు పైగా ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు, ఆసుపత్రి పరిపాలనా విభాగం అధికారులకు, విద్యుత్ శాఖా అధికారులకు సమాచారం ఇచ్చారు.

 చిన్నారుల ప్రాణాలు ?

చిన్నారుల ప్రాణాలు ?

ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న నలుగురు చిన్నారల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.

 ఆరోగ్య శాఖా మంత్రి ఆదేశాలు

ఆరోగ్య శాఖా మంత్రి ఆదేశాలు

విషయం తెలుసుకున్న ఛత్తీస్ గఢ్ రాస్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్ సింగ్ దియో అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్షం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం కారణంగా మా పిల్లల ప్రాణాలు పోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు సక్రమంగా పని చెయ్యలేదని స్థాని్ మీడియా తెలిపింది.

English summary
Children: Four infants dies due to 4 hour power cut in medical college hospital in Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X