చీ చైనా: భారత్ పుండు మీద కారం చల్లింది: పాక్ వంత
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో పుండుపై కారం చల్లినట్లు భారత్ పట్ల చైనా వ్యవహరిస్తుంది. భారత్ మీద ఉన్న అక్కసు మరో సారి వెళ్లగక్కింది. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే భారత్ తీర్మాణాన్ని చైనా అడ్డుకుంది.
ఈ విషయంలో భారత్ మీద చైనా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద నిరోదం పేరిట భారత్ రాజకీయం చేస్తుందని చైనా అంటుంది. మసూద్ అజార్ ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్ డిమాండ్ చేసింది.
మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత తీర్మానాన్నిచైనా వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్, ఊరీ ఉగ్రవాదుల సూత్రధారి మసూద్ అంతర్జాతీయంగా స్వేచ్చగా తిరుగుతున్నాడని, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అతను నిధులు సేకరిస్తున్నాడని మన దేశం చెప్పింది.
భారత్-అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ సన్నిహితంగా మెలుగుతున్న నేపధ్యంలో ఇరాకాటంలో పెట్టేందుకు చైనా మసూద్ అజార్ విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని వెలుగు చూసింది.

గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్ పింగ్ భారత పర్యటనకు రానున్న నేపధ్యంలోనే చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద నిరోదం విషయంలో ద్వంద వైఖరులు ఉండరాదని, ఉగ్రవాద పోరాటం పేరిట రాజకీయం చెయ్యరాదని చైనా విదేశాంగ ఉపమంత్రి లీ బావోడాంగ్ సోమవారం భారత్ ను ఉద్దేశించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మసూద్ విషయంలో వీటో గడువు ముగియడంతో ఇటీవల దానిని ఇంకో ఆరు నెలలు పొడిగించింది. చైనా అడ్డు చెప్పకుంటే భారత్ తీర్మాణం దానంతట అదే ఆమోదం పొందేది. మరో వైపు అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్ జీ) లో భారత్ సభ్యత్వంపై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరపడానికి తాము సిద్దం అని చైనా చెప్పింది.












Click it and Unblock the Notifications