ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్ వద్ద హెలిప్యాడ్ నిర్మాణం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ:వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో చైనా సైన్యం హెలిప్యాడ్‌తో పాటు ఇతర నిర్మాణపనులను చేపట్టిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డోక్లామ్ వద్ద చైనా, ఇండియా మధ్య ఏర్పడిన సమస్యను రెండు దేశాలు దౌత్యపరంగా పరిష్కరించుకొన్నాయి.
గత ఏడాది డోక్లామ్ వద్ద ఇరు దేశాలకు చెందిన ఆర్మీ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. సుమారు మూడు మాసాలకు పైగా ఈ ప్రాంతంలో యుద్ద వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన కూడ నెలకొంది.
అయితే ఈ సమస్యను రెండు దేశాలు సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకొన్నాయి. అయితే ఈ సమస్య ఇంకా తీరలేదని స్పష్టమౌతోంది. డోక్లామ్ సరిహద్దు ప్రాంతంలో చైనా పలు నిర్మాణాలను చేపడుతోంది.

డోక్లామ్ వద్ద హెలిప్యాడ్
డోక్లామ్ వద్ద హెలిప్యాడ్ తో పాటు ఇతర నిర్మాణాలను చైనా నిర్మిస్తోందని భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోమవారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సీతారామన్ ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రకటించారు. హెలిప్యాడ్‌తో పాటు కందకాలు, ఆర్మీ కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తోందని వివరించారు.

చైనా అధికారులతో చర్చలు
చైనా అధికారులతో డోక్లామ్ వద్ద చోటు చేసుకొన్న పరిణామాలపై పలు దఫాలుగా చర్చించామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు పార్లమెంట్‌లో ప్రకటించారు. డోక్లామ్ వద్ద కందకాలు, హెలిప్యాడ్ నిర్మాణాల విషయాన్ని చైనా దౌత్యాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు ఆమె వివరించారు.

శీతాకాలంలో డోక్లామ్ వద్ద చైనా ఆర్మీ
డోక్లామ్ వద్ద చైనా ఆర్మీని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోహరించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు, శీతాకాల సమయంలో డోక్లాం వద్ద చైనా ఆర్మీ భారీగా మోహరించిందని చెప్పారు.

ఆర్మీ రవాణాకు మార్గం
త్వరగా ఆర్మీని గమ్యస్థానాలకు చేర్చేందుకు డోక్లాం వద్ద హెలిప్యాడ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డోక్లామ్ వద్ద నుండి తమ ఆర్మీని సమీప ప్రాంతాలకు చేర్చేలా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. భవిష్యత్ అవసరాల రీత్యా డోక్లామ్ వద్ద చైనా ఆర్మీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుందని రక్షణ రంగ నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications