భారత్ పై చైనా మరోదుశ్చర్య; పవర్ గ్రిడ్ లే టార్గెట్ గా రంగంలోకి చైనాహ్యాకర్లు

డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సరానికి పైగా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం లడఖ్ సమీపంలో తన కార్యకలాపాలను చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం భారత్ కు ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా భారత సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. హ్యాకర్ ల సహాయంతో సరిహద్దుల్లో ఉన్న విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ కు ప్రయత్నం చేసింది. ఇక ఈ విషయాన్ని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ బయటపెట్టింది. లడఖ్ రీజియన్లోని పవర్ గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ సంస్థ ధ్రువీకరించింది.

లడఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా

లడఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా


చైనా ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఇటీవలి నెలల్లో లడఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో రెండు దేశాల మధ్య నెలల తరబడి సైనిక ప్రతిష్టంభన తరువాత ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఇటీవలి నెలల్లో, ఈ రాష్ట్రాలలో గ్రిడ్ నియంత్రణ మరియు విద్యుత్ పంపకం కోసం రియల్ టైం కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDCలు) లక్ష్యంగా చేసుకుని నెట్‌వర్క్ చొరబాట్లను తాము గమనించినట్టుగా వెల్లడించింది.

స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లలో హ్యాకింగ్ యత్నం... చైనా అధికారిక సైబర్ నేరగాళ్ళ పనే

స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లలో హ్యాకింగ్ యత్నం... చైనా అధికారిక సైబర్ నేరగాళ్ళ పనే


ముఖ్యంగా, ఈ లక్ష్యం భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గుర్తించబడిన స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లు ఉత్తర భారతదేశంలో, లడఖ్‌లోని వివాదాస్పద భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నాయని ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ఇక హ్యాకింగ్ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్ సెంటర్ల నుంచి వచ్చినవేనంటూ సదరు ఇంటిలిజెంట్ సంస్థ నివేదిక వెల్లడించింది.

ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన ఇంటిలిజెన్స్ సంస్థ

ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన ఇంటిలిజెన్స్ సంస్థ

పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు, జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. రికార్డెడ్ ఫ్యూచర్ నివేదికను ప్రచురించే ముందు తమ పరిశోధనల గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల నుండి బెదిరింపులను గుర్తించడంలో ప్రత్యేకతతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పరిగణించబడుతున్న ఇంటెలిజెన్స్ సంస్థ ప్రకారం, చైనా కోసం దాడి చేసేవారు భారత్లోని క్లిష్టమైన మౌలిక సదుపాయాల వ్యవస్థల గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

Recommended Video

    Russia కు సాయం చేస్తే China పైనా ఆంక్షలు..! - America | Oneindia Telugu
    సంక్లిష్ట వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం చొరబాట్ల లక్ష్యం

    సంక్లిష్ట వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం చొరబాట్ల లక్ష్యం


    గత 18 నెలలుగా భారతదేశంలోని రాష్ట్ర మరియు ప్రాంతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్‌ల నిరంతర లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొదట రెడ్ ఎకో నుండి మరియు ఇప్పుడు TAG-38 కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్ ఉపయోగం కోసం సామర్థ్యాలను అభివృద్ధి చేయడం లేదా భవిష్యత్ ఆకస్మిక కార్యకలాపాలకు సన్నాహకంగా సిస్టమ్ అంతటా తగినంత ప్రాప్యతను పొందడం కోసం ఈ సంక్లిష్ట వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం చొరబాట్ల లక్ష్యం అని రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+