• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిబెట్ పీఠభూమిలో బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్స్: గోబీ ఎడారి మీదుగా: రెచ్చగొడుతోన్న చైనా

|

న్యూఢిల్లీ: చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్‌ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత్ తనవంతు ప్రయత్నాలను కొనసాగిస్తుండగా.. దానికి విఘాతం కలిగించేలా చైనా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బలపరిచేలా.. సరిహద్దుల్లో చైనా తన సైనిక బలగాన్ని మరింత పెంచింది. యుద్ధ సామాగ్రిని తరలించింది.

  India-China Stand Off : భారత్‌ను యుద్ధానికి ప్రేరేపించేలా China కుట్రలు.. యుద్ధ సామాగ్రి తరలింపు!

  మహిళల కోసం ఏపీలో మరో సంక్షేమ పథకం: 8 లక్షలకు పైగా ఆ గ్రూపులకు బెనిఫిట్: రూ.6345 కోట్లతో

  టిబెట్ పీఠభూమిలో భారీగా మోహరింపు..

  టిబెట్ పీఠభూమిలో భారీగా మోహరింపు..

  తాజాగా టిబెట్ పీఠభూమిని చైనా తన సైనిక బలగాలతో నింపేసింది. కొత్తగా బాంబర్లను మోహరింపజేసింది. ఎయిర్ డిఫెన్స్ ట్రూప్, స్పెషల్ ఫోర్స్‌ను టిబెట్ పీఠభూమికి తరలించింది. హెచ్-6 బాంబర్లు, వై-20 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను తరలించింది. భారీ పరిమాణంలో యుద్ధ సామాగ్రిని తరలించగల శక్తి సామర్థ్యాలు వై-20 ఎయిర్ క్రాఫ్ట్స్‌కు ఉన్నాయి. వాటితో పాటు హెచ్‌జే-10 యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  పొరుగు దేశాల సరిహద్దుల నుంచి

  పొరుగు దేశాల సరిహద్దుల నుంచి

  చైనా తన పొరుగు దేశాల సరిహద్దుల నుంచి టిబెట్ పీఠభూమికి భారీ ఎత్తున సైన్యాన్ని తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 71వ గ్రూప్ ఆర్మీని చైనా బరిలోకి దింపింది. హెచ్‌జే-10 యుద్ధ ట్యాంకులతో కూడిన ఈ ఆర్మీ గ్రూప్ చైనా ఈశాన్య ప్రాంతంలోని గ్ఝియాన్షు ప్రావిన్స్ నుంచి గోబీ ఎడారి మీదుగా వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి టిబెట్ పీఠభూమికి చేరుకుంది. మరిన్ని బలగాలను తరలిస్తోంది.

  యుద్ధానికి సమాయాత్తమౌతోందా?

  యుద్ధానికి సమాయాత్తమౌతోందా?

  టిబెట్ పీఠభూమిలో చైనా తరలిస్తోన్న యుద్ధ సామాగ్రిని చూస్తోంటే.. యుద్ధానికి సమాయాత్తమౌతున్నట్లే కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, ఆర్టిల్లరీ, యుద్ధ సామాగ్రిని తరలంచే భారీ వాహనాలు, పారా ట్రూపర్లు, ఇన్‌ఫాంట్రీ యూనిట్లను ఇతర దేశాల సరిహద్దుల నుంచి రప్పిస్తోంది. కిందటి నెల 29, 30 తేదీల్లో పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్‌పాయ్ పర్వతంపై రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ, వార్నింగ్ షాట్ ఫైరింగ్ తరువాతే చైనా.. టిబెట్ పీఠభూమిలో సైనిక బలగాలను పెంచింది.

   విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేపథ్యంలో..

  విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేపథ్యంలో..

  ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తోన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో చైనా కౌంటర్ పార్ట్ వాంగ్ యీ భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య లంచ్ మీటింగ్ ఏర్పాటు కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ ఏర్పాటవుతుందని భావిస్తోన్న తరుణంలోనే చైనా తన సైనిక బలగాలను మోహరింపజేసింది.

  English summary
  China deploys bombers, air defence troops in plateau region amid border tensions with India. H-6 bombers and Y-20 large transport aircraft attached to the PLA Central Theater Command Air Force were deployed in the region.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X