వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: అజిత్ దోవల్, జైశంకర్‌తో భేటీ కానున్న వాంగ్ యీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పర్యటన ముగించుకున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా ఆయన పాకిస్థాన్ నుంచి నేటి సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు.

కాగా, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సమయంలో కాశ్మీర్‌పై చైనా మంత్రి వాంగ్ యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గల్వాన్ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత సీయిర్ స్థాయి చైనా నేత మనదేశంలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జమ్మూకాశ్మీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. కాశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయి. చైనా కూడా అదే కోరుకుంటోంది అని అభ్యంతర వ్యాఖ్యలు చేశారు చైనా మంత్రి వాంగ్ యీ. ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది.

China foreign minister Wang Yi lands in Delhi, likely to meet EAM Jaishankar, NSA Ajit Doval

జమ్మూకాశ్మీర్ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారం అని తేల్చి చెప్పింది. చైనా సహా ఏ ఇతర దేశానికీ దాని గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేసింది. కాగా,
జమ్మూ కాశ్మీర్ విషయంలో తన వ్యూహాత్మక మిత్రదేశం -- పాకిస్తాన్ వైఖరికి చైనా పదే పదే తన మద్దతును పునరుద్ఘాటించింది. గత నెలలో, చైనా-పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ-కాశ్మీర్ విషయంలో చేసిన సూచనలను భారతదేశం తిరస్కరించింది.

ఈ ప్రాంతం అలాగే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో "ఉన్నాయి, అలాగే ఉంటాయి" అని నొక్కి చెప్పింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య బీజింగ్‌లో జరిగిన చర్చల తరువాత ఫిబ్రవరి 6న సంయుక్త ప్రకటన విడుదలైంది. భారతదేశం ఎప్పుడూ ఇలాంటి సూచనలను తిరస్కరిస్తూనే ఉంటుందని, మన వైఖరి చైనా, పాకిస్థాన్‌లకు బాగా తెలుసునని బాగ్చి అన్నారు.

గత ఏడాది జులైలో, జమ్మూ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు చైనా తన మద్దతును పునరుద్ఘాటించింది, పరిస్థితిని క్లిష్టతరం చేసే ఏ ఏకపక్ష చర్యను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని భారత్.. చైనా, పాక్ దేశాలకు తేల్చి చెప్పింది.

English summary
China foreign minister Wang Yi lands in Delhi, likely to meet EAM Jaishankar, NSA Ajit Doval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X