సరిహద్దులో ఆగని చైనా కుట్రలు: ఎయిర్‌ఫీల్డ్‌లో ఆధునాతన జెట్‌లు, నిశితంగా గమనిస్తున్న భారత్
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా తన కుట్రలను ఆపడం లేదు. భారతదేశంతో సరిహద్దు వెంబడి చైనా సైనిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని "ఆందోళనకరం" అని ఒక అమెరికన్ మిలిటరీ అధికారి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చైనా వైమానిక దళం తూర్పు లడఖ్ సెక్టార్ సమీపంలోని హోటాన్ వైమానిక స్థావరం వద్ద రెండు డజనుకు పైగా ఫ్రంట్‌లైన్ విమానాలను మోహరించినట్లు బయటపడింది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. చైనీస్ వైమానిక దళం 25 ఫ్రంట్‌లైన్ ఫైటర్లను హోటాన్ ఎయిర్ బేస్‌లో ఉంచింది. ఇందులో వారి J-11, J-20 ఫైటర్లు ఉన్నాయి.

"చైనీయులు ఇంతకుముందు అక్కడ MiG-21 క్లాస్ ఫైటర్‌ల డిటాచ్‌మెంట్‌లను నిర్వహించేవారు, కానీ ఇప్పుడు వాటి స్థానంలో పెద్ద సంఖ్యలో మరింత సామర్థ్యం, అధునాతన విమానాలు ఉన్నాయి' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చైనీస్ వైమానిక దళం భారత భూభాగానికి దగ్గరగా కొత్త ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తోంది, ఇది తక్కువ ఎత్తుల నుంచి మిషన్‌లను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం (PLAAF) కార్యకలాపాలపై భారతీయ ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇది భారతదేశంతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉత్తరాన లడఖ్‌కు ఎదురుగా ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించింది.
హోటాన్‌తో పాటు, ఏజెన్సీలు జిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని PLAAF గార్ గున్సా, కాష్‌ఘర్, హాపింగ్, డ్కోంకా ద్జోంగ్, లింజి, పంగట్ ఎయిర్‌బేస్‌లపై కూడా నిశితంగా గమనిస్తున్నాయి భారత నిఘా వర్గాలు.
చైనీస్ PLAAF ఇటీవలి కాలంలో ఈ స్థావరాలను పటిష్టమైన షెల్టర్ల నిర్మాణం, రన్‌వే పొడవును పొడిగించడం, పెద్ద కార్యకలాపాలను నిర్వహించడానికి అదనపు బలగాలను మోహరించడంతో అప్‌గ్రేడ్ చేస్తోంది.
ఎల్ఏసీ వైపు చైనా బలగాలు చేస్తున్న కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం కూడా సంసిద్ధతను పెంచుకుంది. సుఖోయ్-30MKIలు, MiG-29లు, మిరాజ్-2000లను ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌ల వద్ద మోహరించింది.












Click it and Unblock the Notifications