కాశీలో రెడ్ అలర్ట్! గంగమ్మ ఉగ్రరూపం.. మునిగిపోయిన మణికర్ణిక ఘాట్
పుణ్యక్షేత్రమైన వారణాసిలో గంగానది ఉగ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంగమ్మ ఒడ్డుదాటి ప్రవహిస్తుండటంతో వారణాసిలోని ప్రముఖ ఘాట్లన్నీ నీటమునిగాయి. గంటకు 50 మిల్లీమీటర్ల వేగంతో నీటిమట్టం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నీటి ప్రవాహం హోరెత్తుతుండటంతో ఘాట్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయికి నది సమీపిస్తుండటంతో స్థానిక యంత్రాంగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
గంగానది నీటిమట్టం 67.68 మీటర్లకు చేరడంతో ప్రతిష్ఠాత్మక మణికర్ణిక ఘాట్ సైతం జలమయమైంది. దీంతో శవదహనాలు చేసేందుకు స్థలం లేక, భవనాల పైకప్పులపై , ఎత్తైన ప్రాంతాల్లో కర్మకాండలు నిర్వహించాల్సిన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఘాట్ లోకి ఎవరూ దిగకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారుు. మరోవైపు జగత్ ప్రసిద్ధి చెందిన 'గంగా హారతి' వేదికల ముందర వరద నీరు వచ్చి చేరడంతో హారతి కార్యక్రమాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 నుంచి 48 గంటల్లో పరిస్థితి మరిన్ని వందల ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ రంగప్రవేశం!
వరద పరిస్థితి చేయిదాటకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లఖింపూర్ ఖేరీ తదితర ముంపు ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను దించింది. నదీ ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు డీప్ డైవర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ నదులు, చెరువులు, లోతైన ప్రవాహాల వైపు వెళ్లవద్దని, ప్రమాదకర ఘాట్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
'మిషన్ సేఫ్ ఫ్యూచర్'.. పాఠశాల వాహనాలపై కఠిన ఆంక్షలు!
ఒకవైపు వరదలు భయపెడుతుంటే, మరోవైపు వర్షాకాలంలో విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం 'మిషన్ సేఫ్ ఫ్యూచర్' ప్రచారాన్ని వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న దాదాపు 82,000 కు పైగా స్కూల్ బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేపట్టారు. ఫిట్‌నెస్ లేని 6,066 స్కూలు వాహనాలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, 356 వాహనాలను సీజ్ చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే డ్రైవర్లను ఏరివేసేందుకు 27 వేల మందికి పైగా డ్రైవర్ల క్యారెక్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. వరదలు, భద్రతా ప్రమాదాల వేళ ప్రజలు, పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications