సచిన్- విరాట్ లో ఎవరు బెస్ట్, ఫాలో కావాల్సిందే: తేల్చేసిన ఏబీ డివిలియర్స్..!!
క్రికెట్ లో ఆ ఇద్దరూ ఇద్దరే. ఆ ఇద్దరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇద్దరూ ఇండియన్ క్రికెట్ లో ప్రత్యేక స్థానం సాధించారు. ఆ ఇద్దరే సచిన్ - విరాట్. కాగా.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్.. ఎవరు నెక్స్ట్ అంటే ఏంటి సమాధానం. ఇదే ప్రశ్న పైన దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఇద్దరిలో తన ఓటు ఎవరికో తేల్చి చెప్పారు. అందుకు కారణాలను విశ్లేషించారు. ఇప్పుడు ఏబీ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి.
సచిన్ టెండుల్కర్ - విరాట్ కోహ్లీ. క్రికెట్ లోని అన్ని రికార్డులను తన ఖాతాలో జమ చేసుకున్న సచిన్.. క్రీజు లో ఉంటే ఎలాంటి జట్టునైనా బెంబేలెత్తించే ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ. అసలు ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది ఆసక్తి కర చర్చ. దీని పైన ఏబీ డీవిలియర్స్ తన మార్క్ విశ్లేషణ చేసాడు. విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై భారత బ్యాటింగ్ స్థాయిని పెంచారని, తన సమకాలీన ఆటగాళ్లు కూడా అక్కడి పరిస్థితుల్లో మెరుగ్గా రాణించేలా ప్రేరేపించారని పేర్కొన్నారు.

విదేశీ పరిస్థితుల్లో భారత్ తరపున సచిన్ టెండూల్కర్ ఒక ప్రమాణాన్ని నెలకొల్పినప్పటికీ, కోహ్లీ ఆ ప్రదర్శనలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్‌లో 15,921 పరుగులు మరియు రికార్డు స్థాయిలో 51 సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారని గుర్తు చేసారు. 176 ఇన్నింగ్స్‌లలో విదేశీ గడ్డపై ఆయన సగటు 55గా ఉందని చెప్పుకొచ్చారు.
అదే విధంగా 2025లో టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లీ, 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశారు. విదేశీ గడ్డపై కోహ్లీ సగటు 68 మ్యాచ్‌లలో 41గా ఉంది. భారత్ కోసం కొత్త ఒరవడిని సచిన్ ప్రారంభించినా.. విరాట్ కోహ్లీ అంతటి దృఢత్వం లేదా స్థాయి అప్పట్లో సచిన్‌కు లేదని పేర్కొన్నారు. భారత్ కు చెందిన బ్యాటర్ అయినప్పటికీ బౌన్సీ మరియు సీమింగ్ పిచ్‌లపై రాణించవచ్చని నిరూపించిన మొదటి వ్యక్తి సచిన్ గా పేర్కొన్నారు.
విరాట్ ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రమాణాలను మరింత పెంచారని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే ఒరవడిని కేఎల్ రాహుల్, దేవత్ పడిక్కర్ వంటి వారు కొనసాగిస్తూ..విరాట్ మరియు సచిన్ అడుగుజాడల్లో నడవటం ప్రారంభించారని విశ్లేషించారు. ఇక.. కెఎల్ మంచి టెక్నిక్ కలిగిన ఆటగాడుగా ప్రశంసించారు. టీం ఇండియాకు ఒక కీలక ఆస్తిగా అభివర్ణించారు. ఇప్పుడు డీ వీలియర్స్ చేసిన విశ్లేషణ వైరల్ అవుతోంది.














Click it and Unblock the Notifications