చైనా, పాక్‌తో ముప్పేమీ లేదు: రావత్

Posted By:
Subscribe to Oneindia Telugu

డెహ్రడూన్: దేశ భద్రతకు చైనా, పాకిస్థాన్‌లతో సత్వర ముప్పు లేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఇటీవలనే ఈ రెండు దేశాలతో యుద్దానికి తాము సిద్దంగా ఉన్నామని రావత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.

ఉత్తరాన ఉన్న చైనా, పశ్చిమాన ఉన్న పాక్ దేశాలు భారత్‌కు శత్రువులేనని , ద్విముఖ యుద్దం చేసేందుకు సిద్దం కావాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

పాక్‌పై మాట మార్చిన చైనా, మేం దాడి చేస్తే భారత్ కోలుకోలేదన్న డ్రాగన్

China, Pakistan not a threat to India, army chief general Rawat now says

ఉత్తరాఖండ్‌ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిపిన్ రావత్ మీడియాతో మాట్లాడారు. చైనా, పాక్ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రావత్ స్పందించారు.

బ్రిక్స్ సమావేశంలో చైనా అధ్యక్షుడు, ఇండియా ప్రధానిలు డోక్లామ్ విషయమై చర్చించారు. పంచశీల సూత్రానికి కట్టుబడి ఉంటామని చైనా హమీ ఇచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదానికి తెరపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Army chief General Bipin Rawat on Saturday said neither China nor Pakistan is an imminent threat to the country in a departure from his earlier statement wherein he had dubbed the two neighbours India’s northern and western adversaries respectively and that the country needed to be prepared for a two-front war.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X