• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా .. ఈ సమయంలో ఎందుకిలా ?

|

ఒకపక్క భారత చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా కష్ట కాలంలో ప్రజల ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టకుండా చైనా ఎందుకు భారతదేశంతో యుద్ధానికి సిద్ధం అవుతుంది అన్నది ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న . ఇక దానికి ఎవరికి వారు వారి కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రపంచదేశాలు కరోనా బారిన పడటానికి చైనా కారణం అని అన్ని దేశాలు దుమ్మెత్తిపోశాయి. ఇక అపవాదు నుండి అన్ని దేశాల దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా చైనా యుద్ధానికి సై అంటుంది అన్న భావన వ్యక్తం అవుతుంది.

  China Ready For War Again On India!

  తమ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లాలని చైనా సంచలన నిర్ణయం ..ఉద్రిక్తతల నేపధ్యమేనా ?

  ఇప్పటి వరకు ఇండియా శత్రువుల జాబితాలో పాకిస్తాన్ మాత్రమే .. ఇప్పుడు చైనా కూడా

  ఇప్పటి వరకు ఇండియా శత్రువుల జాబితాలో పాకిస్తాన్ మాత్రమే .. ఇప్పుడు చైనా కూడా

  ఇప్పటి వరకు ఇండియాకు శత్రుత్వం పాకిస్తాన్ తో మాత్రమే ఉండేది. ఇక పాకిస్థాన్ మాత్రమే నిత్యం బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండేది. ఇక తాజాగా కరోనా కష్ట కాలంలో కూడా పాక్ ఆర్మీతో పాటుగా, ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడే విధంగా చేస్తూ కాశ్మీర్ లో అలజడులు సృష్టించే ప్రయత్నం చేసినా ఇండియా సమర్ధవంతంగా తిప్పి కొట్టింది . ఇక ఇప్పుడు కరోనా తో పోరాటం సాగిస్తున్న వేళ వూహించని విధంగా ఇప్పుడు శత్రువుల లిస్ట్ లో చైనా కూడా చేరిపోయింది. లడక్, సిక్కిం బోర్డర్ లో చైనా ఆర్మీ మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

  ఉద్రిక్తంగా మారిన లడక్ బోర్డర్

  ఉద్రిక్తంగా మారిన లడక్ బోర్డర్

  ల‌ఢ‌ఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ దాటి భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించి త‌మ ప్రాంత‌మంటూ చైనా కవ్వింపు చర్యలకు దిగటమే కాదు భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. ఇటీవల భార‌త బ‌ల‌గాల‌తో చైనా సైనికులు తోపులాట‌కు దిగారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ నెలకొంది.పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీగా తలపడగా గాయాలపాలయ్యారు . దీంతో లడక్ బోర్డర్ ఉద్రిక్తకరంగా మారింది. తాజాగా ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర దాదాపు 5 వేల మంది సైనికుల‌ను మోహ‌రించింది చైనా. దౌల‌త్ బెగ్ ఓల్డీ స‌హా పలు ఏరియాల్లో చైనా ఆర్మీ భారీగా మోహరించి కయ్యానికి కాలు దువ్వుతున్నారు .

  రహస్యంగా నరవాణే లడక్ పర్యటన అందుకేనా ... యుద్ధానికి సిద్ధం అవ్వాలన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

  రహస్యంగా నరవాణే లడక్ పర్యటన అందుకేనా ... యుద్ధానికి సిద్ధం అవ్వాలన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

  ఇక ఈ పరిస్థితుల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ అధినేత నరవాణే ఇటీవలే లడక్ కు వెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించి వచ్చారు. నరవాణే లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో యుద్ధం జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా కూడా భారీగా ఆర్మీని మోహరిస్తోంది. పైగా నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపి యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని రెడీ చేయాలని పిలుపునిచ్చారని సమాచారం.

  చైనా ఇండియా బోర్డర్ లో యుద్ధ మేఘాలు .. చైనా నిర్ణయానికి కారణం అదేనా ?

  చైనా ఇండియా బోర్డర్ లో యుద్ధ మేఘాలు .. చైనా నిర్ణయానికి కారణం అదేనా ?

  దీనికంటే ముందు ఇండియా ప్రధాని మోడీ అత్యవసరంగా హైలెవల్ మీటింగ్ జరపడం కూడా యుద్ధ సంకేతాలకు సూచనగా నిలుస్తుంది. జరుగుతున్నా తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇండియా, చైనా దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదేమో అన్న భావన కలుగుతుంది . చైనాపై ప్రపంచం చేస్తున్న కరోనా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి చైనా అనవసరంగా ఇండియాతో యుద్ధానికి దిగుతుందా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది.

  English summary
  Indian Army chief Naravane recently visited Ladakh and reviewed the situation there. There are suspicions that a war could be waged as the Naravan Ladakh tour was secret. China, on the other hand, is heavily deploying the Army. Yesterday, Chinese President Jin Ping held talks with Army officials and called for the army to be ready for war.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more