వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: చైనా ఖైదులో భారత జవాన్లు.. చర్చలతో 10 మంది విడుదల.. డ్రాగన్ లక్ష్యం నెరవేరినట్లేనా?

|
Google Oneindia TeluguNews

దేశ సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో చైనా సరిహద్దులో జరిగిన హింసాకాండపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తున్నది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కీలక ప్రాంతమైన గాల్వాన్ లోయలో ఘర్షణకు సంబందించి ఇండియన్ ఆర్మీ తాజాగా మరో అధికారిక ప్రకటన చేసింది. మన జవాన్లను చైనా బందీలుగా పట్టుకుందన్న షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తూ.. చర్చల తర్వాత 10 మంది విడుదలయ్యారని పేర్కొంది.

భారత్ ప్రతీకారం.. చైనాపై ఎయిర్ స్ట్రైక్స్.. భారీగా ఫైటర్ జెట్స్,యుద్ధనౌకల మోహరింపు.. 'ది సన్' సంచలనంభారత్ ప్రతీకారం.. చైనాపై ఎయిర్ స్ట్రైక్స్.. భారీగా ఫైటర్ జెట్స్,యుద్ధనౌకల మోహరింపు.. 'ది సన్' సంచలనం

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోన్న క్రమంలో.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో సోమవారం(ఈనెల 15) రాత్రి భారత బలగాలపై చైనా సైనికులు పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తొలుత ముగ్గురు మాత్రమే చనిపోయారని, ఆ తర్వాత అమరుల సంఖ్య 20గా ఉందని వెల్లడైంది. తాజాగా వెలుగులోకి వస్తోన్న రిపోర్టుల ప్రకారం మనవైపు 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పదుల సంఖ్యలో భారత జవాన్లను చైనా బందీలుగా పట్టుకుందన్న విషయం కలకలం రేపింది. నాటి ఆపరేషన్ లో గాయపడ్డ సైనికుల సంఖ్యే 76గా ఉందని, చనిపోయినవాళ్లు, చైనాకు బందీలుగా చిక్కినవాళ్లను కలిపితే ఈ సంఖ్య భారీగా ఉండొచ్చనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చేసిన అధికారిక ప్రకటన కన్ప్యూజన్లకు చెక్ పెట్టినట్లయింది.

3రోజులు.. 10 మంది..

3రోజులు.. 10 మంది..

గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న హింసాయుత ఘర్షణలో మనవాళ్లు 20 మందిచి చంపేసి, మరికొంత మందిని అతి దారుణంగా లోయలోకి నెట్టేసింది. దాంతోపాటు చేతికి చిక్కిన ఇంకొందరిని బందీలుగా తీసుకుంది. వాళ్లలో ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అందరి విడుదల కోసం 3వ ఇన్‌ఫంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపత్ నేతృత్వంలోని బృందం పలు దఫాలుగా చైనా సైన్యంతో చర్చలు జరిపింది. మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు గురువారం రాత్రి 10 మంది భారత బలగాలను చైనా విడుదల చేసింది.

ఇంకా బదీలు ఉన్నారా?

ఇంకా బదీలు ఉన్నారా?

గాల్వాన్ లోయలో చైనా అక్రమంగా వేసిన టెంట్లను ఖాళీ చేయించే క్రమంలో భారత జవాన్లపై దాడి జరగడం, అంత కీలకమైన ఆపరేషన్ లో సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారు? అవతలివాడు చంపేస్తున్నా వెపన్స్ వాడొద్దని ఆదేశాలు ఇచ్చిందెవరు? అంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. కాగా, గురువారం విడుదలైన 10 మంది కాకుండా.. చైనా చెరలో మనవాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి సమాధానంగా.. ‘‘మన బలగాల్లో ఇంకా ఎవరూ తప్పిపోలేదు‘‘అంటూ ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.

1962 తర్వాత తొలిసారి..

1962 తర్వాత తొలిసారి..

భారత సైనికులను చైనా బందీలుగా తీసుకోవడం 1962 యుద్ధం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. యుద్ధం తర్వాత ఐదేళ్లకు, అంటే, 1967లో పరస్పరం కాల్పులు జరుపుకున్న ఘటనలో వందల మంది చనిపోయినా.. ఒకరినొకరు బందీలుగా తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. సరిహద్దులో చివరిసారిగా తూటాలు పేలింది 1975లో. నాడు భారత పెంట్రోలింగ్ బృందంపై చైనా మాటువేసి కాల్పులు జరిపింది. మళ్లీ ఇన్నేళ్లకు ఎల్ఏసీ వెంబడి సైనికులు చనిపోవడం, బందీలుగా పట్టుకోవడం లాంటి యుద్ధ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

Recommended Video

Earthquakes In Haryana & Mizoram వరుస భూకంపాలు.. భారత్‌కు క్లిష్ట పరిస్థితి..!!
చైనా టార్గెట్ సాధించిందా?

చైనా టార్గెట్ సాధించిందా?

బందీలుగా తీసుకున్న భారత జవాన్ల విడుదలతో చైనా తన రక్తపాత చర్యలకు బ్రేక్ వేసినట్లుగా భావించాలని, ఇప్పటికే అది అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు కనబడుతోందని రిటైర్డ్ ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. అక్సాయ్ చిన్ ను స్వాధీనం చేసుకుంటామంటూ భారత ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటన దరిమిలా.. ఆ ప్రాంతానికి వెళ్లే ఏకైక మార్గమైన గాల్వాన్ లోయను చైనా ఆక్రమించేసుకుందని, గాల్వాన్ లోయపై సార్వభౌమాధికార ప్రకటనే అందుకు నిదర్శమని, అలాగే పాంగాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ‘‘ఫింగర్ 4'' ప్రాంతాన్ని కూడా డ్రాగన్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోందని, ఈ టార్గెట్లు సాధించింది కాబట్టే, ఇక కొత్త స్టేటస్ కో పై చైనా చర్చలు జరిపే అవకాశముందని నిపుణులైన మాజీ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.

గాల్వాన్ లోయపై చైనా షాకింగ్ ప్రకటన.. టార్గెట్ అక్సాయ్ చిన్.. 1962 స్ట్రాటజీ.. భారత్ కింకర్తవ్యం?గాల్వాన్ లోయపై చైనా షాకింగ్ ప్రకటన.. టార్గెట్ అక్సాయ్ చిన్.. 1962 స్ట్రాటజీ.. భారత్ కింకర్తవ్యం?

English summary
All Indian soldiers involved in the deadly clashes with the Chinese army at the Galwan Valley in eastern Ladakh on Monday night have been accounted for, the Indian Army said. top retired army commander, who didn’t want to be identified, said: “China has already achieved what it set out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X