వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆర్మీ దుస్సాహసం-అరుణాచల్ నుంచి భారతీయ యువకుడి కిడ్నాప్-కలకలం

|
Google Oneindia TeluguNews

భారత్ సరిహద్దుల్లో ఇప్పటికే పలు వివాదాలను రేకెత్తిస్తూ నిత్యం ప్రతిష్టంభనకు కారణమవుతున్న చైనా ఆర్మీ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇప్పటికే భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ ను తమ భూభాగంగా పేర్కొంటూ వివాదాలకు తెరతీస్తున్న చైనా.. ఇప్పుడు అక్కడ మరో దుశ్చర్యకు పాల్పడింది,

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల యువకుడిని చైనా ఆర్మీ బలగాలు ఎత్తుకెళ్లాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అపహరించినట్లు ఆ రాష్ట్ర ఎంపీ తపిర్ గావో తాజాగా ట్వీట్‌లో వెల్లడించారు. మిరామ్ టారోన్ అనే యువకుడిని మంగళవారం సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుండి పిఎల్‌ఎ అపహరించినట్లు తపిర్ గావో చెప్పారు.

చైనా ఆర్మీ పీఎల్ఏ 17 సంవత్సరాల జిడో విల్‌కు చెందిన ష్ మీరామ్ టారోన్‌ను అపహరించింది. నిన్న 18 జనవరి 2022, ఎగువ ప్రాంతంలోని సియుంగ్లా ప్రాంతం (బిషింగ్ గ్రామం) కింద భారత భూభాగంలోని లుంగ్టా జోర్ ప్రాంతం (చైనా 2018లో భారతదేశంలో 3-4 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది) నుండి అపహరించింది. సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్" అని గావో ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన అన్ని ఏజెన్సీలు అతనిని త్వరగా విడుదల చేయించడానికి చొరవ చూపాలని అభ్యర్ధించినట్లు ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.. అలాగే అపహరణకు గురైన బాలుడి చిత్రాలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం భారత్, చైనాల మధ్య మరో ఉద్రిక్తతకు దారి తీసేలా ఉంది.

chinese army adbucts 17 year old indian boy from arunachal pradesh

మరోవైపు ఈ ఘటనపై వెంటనే స్పందించిన విపక్షకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ.. గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు, భారతదేశ భవిష్యత్తు అయిన ఒక యువకుడిని చైనా కిడ్నాప్ చేసింది. మేము మీరామ్ టారన్ కుటుంబానికి అండగా ఉంటాము మరియు ఆశను వదులుకోము. ఓటమిని అంగీకరించము," అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మౌనమే ఆయన ప్రకటన.. ఆయన పట్టించుకోవడం లేదు' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

English summary
china's people liberation army has abducted an 17 year old indian boy from arunachal pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X