Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ గడ్డపై చైనా మంత్రి: రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో.. కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీ.. దేశ రాజధాని వేదికగా కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. రక్షణ మంత్రుల సమావేశం ఇది. ఎస్‌సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల రక్షణశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ కీలక భేటీకి భారత్.. ఆతిథ్యాన్ని ఇస్తోంది. సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం.

2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. భారత్ సహా చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియాల.. అబ్జర్వర్ స్టేట్స్‌ హోదాలో కొనసాగుతున్నాయి. ఆర్మేనియా, అజర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంది ఇందులో.

General Li Shangfu addresses the SCO Meeting in Delhi

ఇవ్వాళ ఢిల్లీలో ఆరంభమైన ఈ భేటీకి సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ భేటీకి అధ్యక్షతను వహించారు. చైనా మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫు ప్రారంభోపన్యాసం ఇచ్చారు. పాకిస్తాన్‌కు కూడా ఇందులో సభ్యత్వం ఉన్నప్పటికీ- ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఆ దేశ రక్షణ మంత్రి ఇందులో పాల్గొన్నారు.

లఢక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా రక్షణ మంత్రి ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో రెండు దేశాల సైన్యం మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తరువాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గ్రామాలను నిర్మించడం వంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన భారత్‌కు వచ్చారు. తన ప్రారంభోపన్యాసంలో లీ షాంగ్‌ఫు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశాల సరిహద్దుల వద్ద శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తమ దేశాల మధ్య ఉన్న కట్టుబాట్లను ఉల్లంఘించినట్టవుతుందని, దీనివల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఉల్లంఘనలు చోటు చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+