విదేశాంగమంత్రి జైశంకర్ కుమారుడి సంస్ధకు చైనా నిధులు ? చొరబాట్ల వేళ కలకలం !

భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కేంద్రం మాత్రం మౌనంగా ఉంటోంది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకోలేదని మాత్రమే చెబుతోంది. దీనిపై వార్ కొనసాగుతుండగానే విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ కుమారుడు ధృవ్ జైశంకర్ కు చెందిన సంస్ధకు చైనా నిధులు అందాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ కుమారుడు ధృవ్ జైశంకర్ కు చెందిన ఓఆర్ఎఫ్ ఫౌండేషన్ యూఎస్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్ధకు చైనా రాయబార కార్యాలయ నుంచి తాజాగా నిధులు అందినట్లు కాంగ్రెస్ మీడియా విభాగం నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. ఓవైపు చైనా చొరబాట్లపై కేంద్రం మౌనంగా ఉంటోందని, ఇప్పుడు జైశంకర్ కుమారుడి సంస్ధకు చైనా నిధులు అందుతున్నాయని, అందుకే కేంద్రం మౌనంగా ఉంటోందా అని ఆయన ప్రశ్నించారు. రాజస్ధాన్ లో భారత్ జోడో యాత్ర సాగుతున్న వేళ అదే రాష్ట్రానికి చెందిన పవన్ ఖేరా ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

chinese embassy funds to foriegn minister s.jaishankars sons firm ?

ఇవాళ ఓ సమాచారాన్ని బహిర్గతం చేయడం చాలా ముఖ్యమని, యూఎస్ లో విదేశాంగ మంత్రి కుమారుడు నాయకత్వం వహిస్తున్న ఫౌండేషన్, చైనా రాయబార కార్యాలయం నుండి ఒకసారి, రెండుసార్లు కాదు, మూడు సార్లు నిధులు పొందింది. ఇది ఇటీవల జరిగింది. ఈ నిధులు ఎందుకు వచ్చాయి? కారణం ఏంటి? చైనాపై భారత ప్రభుత్వం పదే పదే మౌనం వహించడానికి కారణం ఏమిటి?'' అని ఖేరా ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+