జిన్ పింగ్‌కు మోడీ విందు ఇచ్చే గార్డెన్ ఇదే (ఫోటో)

న్యూఢిల్లీ: మూడు రోజల భారత్ పర్యటనలో భాగంగా తొలిరోజైన బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్‌ రానున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అసాధారణ స్దాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు. చైనా బలగాలతో సహా మూడు వేల మందికి పైగా భద్రత సిబ్బందిని మోహరించారు. ఈ సందర్బంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సహా వారు ప్రయాణించే మార్గాలు, వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. చైనా ప్రధాని పర్యటనలో ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం కాగలవని ప్రధాని మోడీ, తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గుజరాత్ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు స్దానిక వంటకాలే వడ్డిస్తామని రాష్టానికి చెందిన సీనియర్ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. అహ్మాదాబాద్‌లోని సబర్మతీ నది తీరాన ఉన్న రివర్ ఫ్రంట్ గార్డెన్‌లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎంతో పాటు అత్యంత ముఖ్యలైన 22 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

Chinese Prez Xi To Taste Amdawadi Hospitality With Gujarati Food, Garba

జిన్ పింగ్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించడంతోపాటు జిన్ పింగ్ పలు కార్యక్రమాల్లో పాల్గోని.. సాయంత్రం ఏడున్నరకు న్యూఢిల్లీ బయల్దేరుతారని అన్నారు. మరోవైపు.. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయని, వారు పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని లఢఖ్‌ ఎంపీ, బీజేపీ నేత తుప్థాన్‌ ఛెవాంగ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని జిన్‌పింగ్‌తో ప్రస్తావించాలని ప్రధాని మోడీని ఆయన కోరారు. చైనా దురాక్రమణలను లేహ్‌ కలెక్టర్‌ సిమ్రన్‌దీప్‌ ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+