వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోన్న మోదీ - శాటిలైట్ ఫొటోలతో బట్టబయలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా మరోసారి భారత్‌ను దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. అకారణంగా రెచ్చగొట్టేలా వ్యవహరించింది. ఇదివరకు లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు పాల్పడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి. భారత జవాన్లపై దాడికి దిగాయి. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి శతవిధాలా ప్రయత్నించాయి.

గూగుల్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..!!గూగుల్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..!!

చైనా దుందుడుకు..

చైనా దుందుడుకు..

ఈ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పి కొట్టింది. పీఎల్ఏ బలగాలను నిలువరించగలిగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వద్ద ఈ నెల 9వ తేదీన చోటు చేసుకుందీ ఘటన. దీని తరువాత కూడా చైనా తన దుందుడుకు చర్యలను మానుకోలేదు. భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. చైనా రీసెర్చ్ షిప్‌ యాంగ్ వాంగ్-5 తో రహస్యంగా ప్రయోగాలను చేపట్టింది. భారత నౌకాదళ వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. భారత్ అభ్యంతరం తెలపడంతో సముద్ర జలాల నుంచి బయటికి వెళ్లిందీ షిప్.

కొత్త వాదన..

కొత్త వాదన..

ఈ పరిణామాల మధ్య అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కొత్త వాదనను తెర మీదికి తీసుకొచ్చారు. లఢక్ సమీపంలో భారత్-చైనా వాస్తవాధీన రేఖ సమీపంలోని డెప్సాంగ్, డెంచొక్ రీజియన్లను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆక్రమించుకున్నాయని స్పష్టం చేశారు. శాటిలైట్ ఫొటోలు దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశాయని పేర్కొన్నారు.

శాటిలైట్ ఫొటోలు..

శాటిలైట్ ఫొటోలు..

డెప్సాంగ్, డెంచొక్.. వ్యూహాత్మకంగా భారత సైన్యానికి అత్యంత కీలకమైన ప్రాంతాలు. వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాస్తోన్న సైన్యానికి నిత్యావసర సరుకులను సరఫరా చేయడం, యుద్ధ సామాగ్రిని తరలించడానికీ ఈ రెండు రీజియన్లు కీలకంగా వ్యవహరిస్తుంటాయి. అలాంటి ఈ రెండింటినీ చైనా సైన్యం ఆక్రమించుకుందని, ఈ విషయాన్ని శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తోన్నాయని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఎందుకు మాట్లాడట్లేదు..

ఎందుకు మాట్లాడట్లేదు..

మొన్నటికి మొన్న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వద్ద చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిందని ఒవైసీ గుర్తు చేశారు. చైనాను నిలువరించడంలో భారత్ విఫలమౌతోందని, అందుకే తరచూ ఆ దేశం ఇలా దురాక్రమణలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో ఇంతా జరుగుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం నోరు మెదపట్లేదని, దీనికి కారణాలేమిటని ప్రశ్నించారు.

తప్పుదారి పట్టిస్తోన్న మోదీ..

తప్పుదారి పట్టిస్తోన్న మోదీ..

తమ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించట్లేదని ప్రధాని మోదీ యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోన్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. చైనా సైనికులు డెప్సాంగ్, డెంచొక్‌ను ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు రుజువు చేస్తోన్నాయని పేర్కొన్నారు. చైనీయులు భారత భూభాగాన్ని లాక్కోవడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదే చైనీయులతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోందని అన్నారు.

అఖిలపక్షాన్ని పిలవాలి..

అఖిలపక్షాన్ని పిలవాలి..

సరిహద్దుల్లో చైనా దురాక్రమణపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని లేదా పార్లమెంటులో చర్చించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చైనాపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందోననే విషయాన్ని వివరించాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పరిపక్వతను ప్రదర్శించాలని, అలా చేస్తే దేశం మొత్తం మద్దతు ఇస్తుందని అన్నారు. సైన్యం చాలా శక్తిమంతమైనదే అయినప్పటికీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, చైనాను చూసి భయపడుతోందని ఒవైసీ చెప్పారు.

English summary
AIMIM Chief and MP Asaduddin Owaisi said that Chinese soldiers have occupied Depsang and Demchok. Satellite images shows that. But PM Modi misled the country, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X