వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిప్పెండేల్స్: అమెరికా స్ట్రిప్ క్లబ్‌ కింగ్‌గా సంచలనం సృష్టించిన భారతీయుడు స్టీవ్ బెనర్జీ... ఈ క్లబ్ కథ ఓ హత్యతో ఎలా ముగిసింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చిప్పెండేల్స్

స్మోకీ క్లబ్‌లలో మహిళలను రంజింప చేయడం కోసం కండలు తిరిగిన మగవాళ్లు కురచ దుస్తులు వేసుకొని డ్యాన్స్ చేయడం లాంటి పనిని భారతీయ అమెరికా వలసదారులు చేస్తారని ఎవరూ అనుకోరు.

కానీ, ముంబైలో జన్మించిన స్టీవ్ బెనర్జీ ఈ వృత్తిని చేపట్టారు. 1979లో లాస్ ఏంజిల్స్‌లో చిప్పెండేల్స్ పేరుతో పురుష స్ట్రిప్ క్లబ్‌ను నెలకొల్పిన బెనర్జీ సంప్రదాయ అమెరికా డ్రీమ్‌ను తిరగ రాశారు.

ఇక మిగిలినదంతా చరిత్రే. బెనర్జీ స్థాపించిన ఈ క్లబ్ ఫ్రాంచైజీ బాగా విజయవంతమైంది. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజీ చుట్టూ సెక్స్, డ్రగ్స్, హత్యలు కూడా తోడవ్వడంతో బెనర్జీ కథ సంచలనంగా మారింది.

భారత్‌లో బెనర్జీ గురించి, ఆయన పని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అమెరికాలో తమ వివాదాస్పద వ్యవస్థాపకుడు బెనర్జీ ఖ్యాతిని చిప్పెండల్స్ బ్రాండ్ మరుగుమరిచినట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు మారుతోంది.

చనిపోయిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బెనర్జీ కథ మళ్లీ తెరపైకి వస్తోంది. పోడ్‌కాస్ట్, టీవీ షోలలో ఈ కథ గురించి చర్చిస్తున్నారు. ఇటీవలే హులూ ఓటీటీలో కూడా చిప్పెండల్స్‌పై సిరీస్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మించిన డ్రామా సిరీస్ 'వెల్‌కమ్ టు చిప్పెండల్స్’లో కుమైల్ నంజియాని నటించారు.

2014లో 'డెడ్లీ డ్యాన్స్: ద చిప్పెండేల్స్ మర్డర్స్’ అనే పుస్తకం విడుదలైంది. దీని సహ రచయిత స్కాట్ మ్యాక్ డోనాల్డ్.

''చిప్పెండేల్స్ వ్యవస్థాపకుడు బానెర్జీ.. మహిళల వెంట పడే, అతిగా మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకునే పార్టీ వ్యక్తి అని చాలామంది అనుకుంటారు. కానీ స్టీవ్ ఒక రిజర్వ్‌డ్ మనిషి. ప్రత్యర్థులైన డిస్నీ, ప్లేబాయ్, పోలో బ్రాండ్‌లకు దీటుగా ప్రపంచస్థాయి బ్రాండ్‌ను సృష్టించాలనే స్పష్టమైన లక్ష్యంతో ఆయన ఉండేవారు’’ అని స్కాట్ మ్యాక్ డోనాల్డ్ అన్నారు.

కథలో ఆయన ఒక ప్రత్యేకమైన భాగం అని చరిత్రకారిణి నటాలియా మెహ్లామన్ పెట్‌జెలా చెప్పారు. చిప్పెండల్స్ లెగసీపై మళ్లీ ఆసక్తి కలగడానికి ఆమె పాల్గొన్న 'వెల్‌కమ్ టు యువర్ ఫాంటసీ’ పాడ్‌కాస్ట్ ఒక కారణం.

తెల్లగా, అందంగా ఉండే కాలిఫోర్నియా పురుషులకు భిన్నంగా కళ్లద్దాలు, గోధుమ వర్ణంలో, బలిష్టంగా బెనర్జీ ఉండేవారు.

బెనర్జీ కుటుంబీకులు ప్రింటింగ్ పని చేస్తుండేవారు. 1960ల చివరలో 20 ఏళ్ల వయస్సులో ఆయన భారత్ నుంచి కెనడాకు వెళ్లారు. తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. లాస్ ఏంజిల్స్‌లో ఆయన ఒక గ్యాస్ స్టేషన్‌ను సొంతం చేసుకున్నారు.

బెనర్జీకి చాలా పెద్ద ఆశయాలు ఉండేవి. ''ఫ్యాన్సీ వాహనాల్లో గ్యాస్ నింపడానికి వెళ్తూ నేను ఆ కారును నడపాలని అనుకుంటున్నా అని చెప్పేవారు’’ అని నటాలియా తెలిపారు.

1970ల్లో తను కూడబెట్టిన సంపాదనతో లాస్‌ఏంజిల్స్‌లో ఒక డైవ్ బార్‌ను కొనుగోలు చేశారు. అందులోకి జనాలను ఆకర్షించేందుకు బ్యాక్‌గామన్ గేమ్స్, మ్యాజిక్ షో, మహిళల మధ్య బురదలో రెజ్లింగ్ వంటి పోటీలను అందులో ప్రవేశపెట్టారు.

ఒక నైట్ క్లబ్ ప్రమోటర్ అయిన పాల్ స్నిడర్ 1979లో బెనర్జీకి ఒక సలహా ఇచ్చారు. సాధారణంగా 'గే’ క్లబ్‌లలో మాత్రమే కనిపించే పురుష స్ట్రిప్పర్లను మహిళల కోసమే రూపొందించిన ప్రత్యేక షోలోకి తీసుకురావాలని సూచించారు.

అప్పటినుంచి ఆ క్లబ్ పేరును 'చిప్పెండేల్స్’గా మార్చారు.

మహిళలు తరచుగా వెళ్లే సెలూన్ల నుంచి రెస్ట్‌రూమ్‌ల వరకు ఇలా లాస్ ఏంజిల్స్ అంతటా ఈ స్ట్రిప్ షోల గురించి ప్రచారం చేశారని పాడ్‌కాస్ట్‌లో నటాలియా చెప్పారు.

ఈ ప్రచారంతో పెద్ద ఎత్తున మహిళలు చిప్పెండల్స్‌ బాట పట్టారు. ప్రతీరోజు రాత్రి పెద్ద సంఖ్యలో మహిళలు క్లబ్‌కు వెళ్లేవారని ఆమె తెలిపారు.

స్టీవ్ బెనర్జీ

హ్యూ హెఫ్నర్‌కు చెందిన ప్లేబాయ్ బన్నీస్ స్ఫూర్తితో ఈ క్లబ్‌లోని డ్యాన్సర్లు బిగుతుగా ఉండే నల్లని ప్యాంటుపై కఫ్ కాలర్స్ ధరించేవారు.

1980లలో అమెరికాకు 'ఇది షాకింగ్ విషయం’ అని నటాలియా చెప్పారు. 1970లలో వచ్చిన లైంగిక విప్లవం నేపథ్యంలో లైంగిక స్వాతంత్ర్యం అనేది అంగట్లో సరుకుగా మారుతున్న దశలోనే చిప్పెండల్స్ క్లబ్ కూడా వచ్చిందని నటాలియా వివరించారు.

''ఉల్లాసంగా గడిపేందుకు మహిళలకు ఒక ప్రదేశం కావాల్సి వచ్చింది. డ్రింక్స్ తాగుతూ, చిలిపి పనులు చేస్తూ, తమకు అందంగా కనిపించిన మగాడిపై డబ్బులు విసిరేసేందుకు వీలైన చోటు వారికి కావాలి’’ అని క్లబ్ ప్రమోటర్ బార్బరా లిగేటి అన్నారు.

వాల్ట్ డిస్నీ, హెఫ్నర్ బ్రాండ్లతో పోటీపడేంత బ్రాండ్‌ను బానెర్జీ సృష్టించాలనుకున్నారు. అడల్ట్స్ డిస్నీల్యాండ్‌ను ఆయన సృష్టించాలనుకున్నారని ఆమె చెప్పారు.

80వ దశకం తొలినాళ్లలో ఆయన ఎమీ అవార్డు విజేత, కొరియోగ్రఫర్ అయిన నిక్ డి నోయాను కలిశారు. చిప్పెండల్స్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని బానెర్జీని ఆయన ఒప్పించారు.

పాత్రలు, కథాంశాలను ఉపయోగించి షోను ఒక ఇంటరాక్టివ్, థియేట్రికల్ ప్రొడక్షన్‌గా నిక్ డి నోయా మార్చారని చిప్పెండల్స్ డ్యాన్సర్లు, నిర్మాతలు ప్రశంసించారు.

నిక్ డి నోయా

చిప్పెండేల్స్ ఫ్రాంచైజీని న్యూయార్క్ నగరానికి తీసుకెళ్లడంతో పాటు అమెరికావ్యాప్తంగా దీన్ని విస్తరింపజేయడంలో నిక్ డి నోయా సహాయపడ్డారు.

ఈ దశలో కొరియోగ్రఫర్ నిక్ డి నోయా పేరు చిప్పెండేల్‌కు బ్రాండ్‌కు ముఖచిత్రంగా మారడంతో పాటు మీడియాలో ''మిస్టర్ చిప్పండెల్’గా ఆయన పేరుపొందారు. మరోవైపు లాస్ ఏంజిల్స్ నుంచి పనిచేస్తోన్న బానెర్జీ వెనుకబడ్డారు. త్వరలోనే వారిమధ్య పొరపొచ్చాలకు ఇది దారితీసింది.

ఉద్రిక్తతలు పెరగడంతో డి నోయా, బానెర్జీ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నారు. డి నోయా తర్వాత 'యూఎస్ మేల్’ పేరుతో సొంత కంపెనీని నెలకొల్పేందుకు ప్లాన్ చేశారు.

ప్రత్యర్థుల స్ట్రిప్ క్లబ్‌లు పుట్టుకురావడంతో పోటీదారులను నాశనం చేయడం కోసం 'రే కోలన్’ అనే వ్యక్తిని బెనర్జీ నియమించుకున్నారు.

1987లో బెనర్జీ ఆదేశాల మేరకు కోలన్ మరో సహాయకున్ని నియమించుకున్నారు. డి నోయాను ఆ సహాయకుడే కాల్చి చంపారు. డి నోయా కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది.

ఈ నేరంలో బానెర్జీ హస్తం ఉన్నట్లు ఆయన స్నేహితులు, భాగస్వాములు అనుమానించారు.

''ఆ హత్య, బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’’ అని బెనర్జీ లాయర్ బ్రూస్ నహిన్ అన్నారు.

చిప్పండేల్స్

చిప్పెండేల్స్ క్లబ్ ఆస్ట్రేలియా, యూరప్‌లకు వ్యాపించింది.

1991లో చిప్పెండేల్స్ పర్యటనలో భాగంగా యూకేలో ఉన్న బానెర్జీ, కోలన్‌కు ఒక పనిని నిర్దేశించారు. తన క్లబ్‌కు చెందిన మాజీ డ్యాన్సర్లు ప్రారంభించిన ట్రూప్‌లోని సభ్యులను హతం చేయాలని కోలన్‌ను ఆదేశించారు.

ఎఫ్‌బీఐకి దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం, వారికి సైనెడ్ ఇచ్చి అంతమొందిచాలని స్ట్రాబెర్రీ అనే సహచరునికి కోలన్‌ పనిని అప్పగించారు.

అయితే భయపడిన స్ట్రాబెర్రీ ఈ విషయం గురించి, కోలన్ గురించి ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లారు.

కోలన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై కిరాయి హత్య, కుట్ర ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. కోలన్ ఇంటిలో 46 గ్రాములు సైనెడ్ దొరికినట్లు ఏజెన్సీ తెలిపింది.

చిప్పండేల్స్

అరెస్ట్ అయిన కొన్ని నెలల తర్వాత కూడా కోలన్, బెనర్జీకి విధేయుడిగా ఉన్నారు. తాను ఏ తప్పు చేయలేదనే మాటకు కట్టుబడి ఉన్నారు.

''అటార్నీకి డబ్బు చెల్లించడానికి బానెర్జీ నిరాకరించిన తర్వాత మాత్రమే కోలన్, బెనర్జీకి మధ్య సంబంధాలు తెగిపోయాయి’’ అని మెక్‌డొనాల్డ్ చెప్పారు.

1993లో ఎట్టకేలకు ఎఫ్‌బీఐ, బెనర్జీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు సంపాదించగలిగింది. కోలన్ సహాయంతో రహస్యంగా వారి సంభాషణను ఎఫ్‌బీఐ రికార్డు చేసింది.

మోసపూరిత లావాదేవీలు, కుట్ర, హత్య ఆరోపణలతో బెనర్జీని అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

ఈ విచారణ కొన్ని నెలల పాటు సాగిన తర్వాత బెనర్జీ ఒక ఒప్పందానికి అంగీకరించారు. 26 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు చిప్పెండల్స్ యాజమాన్య హక్కులకు అమెరికా ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పుకున్నారు.

చిప్పెండేల్స్ క్లబ్‌ను అమెరికా ప్రభుత్వం జప్తు చేసుకోకుండా ఉండేందుకు బానెర్జీ లాయర్ తీవ్రంగా కృషి చేశారని, కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదని నటాలియా చెప్పారు. 1994లో శిక్ష విధించడానికి ఒకరోజు ముందు బెనర్జీ, జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chippendales: Indian Steve Banerjee, who created a sensation as America's strip club king... How did the story of this club end with a murder?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X