వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్కాంలో షాక్: హోటల్ రూంలో సీఈవో భార్యతో ఎవరు?

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్. ఈ స్కాంలో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జైలులో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్. ఈ స్కాంలో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జైలులో ఉన్నారు. ఇప్పుడు ఇది సరికొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. ఇది పార్లమెంటును స్తంభింప చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కేసును విచారిస్తున్న నోడల్ అధికారి మనోజ్ కుమార్ లేదా అచ్చం అలాగే ఉన్న ఓ వ్యక్తి. సుభ్రా కుందును పోలిన ఓ మహిళతో ఢిల్లీలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు వీడియో ఫుటేజిలో వెల్లడయింది.

<strong>ఇద్దరు ఎంపిల అరెస్టు,ఆత్మరక్షణల్లో టిఎంసి , మమతపై విమర్శల జోరు పెంచిన విపక్షాలు</strong>ఇద్దరు ఎంపిల అరెస్టు,ఆత్మరక్షణల్లో టిఎంసి , మమతపై విమర్శల జోరు పెంచిన విపక్షాలు

సుభ్ర కుందు 17 వేల కోట్ల మేర భారీ మోసానికి పాల్పడిన రోజ్ వ్యాలీ చిట్‌ఫండ్ సంస్థ యజమాని గౌతం కుందు భార్య. అతడిని 2015లోనే అరెస్ట్ చేశారు. గత నెలలో కోల్‌కతా విమానాశ్రయంలో ప్రవేశించిన సుభ్ర కుందు.. ఆ తర్వాత ఢిల్లీలోని ఓ హోటల్‌లో దిగినట్టు సీసీటీవీ ఫూటేజిల ద్వారా పోలీసులు గుర్తించారు.

Chit fund scam: CCTV clips show Rose Valley CEO's wife at hotel

ఈ వీడియోను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీపై దాడి చేసి సోదాలు నిర్వహించిన కోల్‌కతా పోలీసులు... ఈడీ అధికారికి, సుభ్రా కుందుకు మధ్య సంబంధాలున్నట్టు గుర్తించారని వార్తలు వస్తున్నాయి.

కాగా తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి ఈ వివాదంలో ఇరికించారని కుమార్ చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, ఈ ఫూటేజిల్లో కనిపించిన దృశ్యాలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ పేర్కొంది.

రోజ్ వ్యాలీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో. నెలరోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సుదీప్ భట్టాచార్య, తపస్‌పాల్‌లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
CCTV clips show Rose Valley CEO's wife at hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X