బీటెక్, చిత్తూరు టూ బెంగళూరు, ఒక్క క్లిక్ తో కోట్లలో బంగారు, తెలుగోడి కుమ్ముడు !
బెంగళూరు: మన మధ్య ఎలాంటి దొంగలు ఉంటారో ఊహించలేం. విద్యార్హతకు సంబంధించి పనిచేసి సంపాదిస్తారని అనుకుంటే అతను మాత్రం తప్పుడు ఆలోచనతో ముందుకు వెళ్లాడు. బీటెక్ చదివిన ఓ ఇంజినీర్ తాను గజదొంగ అని నిరూపించుకున్నాడు. చదివింది బీటెక్ అయినా సైబర్ హ్యాకింగ్ మాత్రమే చేస్తూ కోట్లాది రూపాయలు సంపాధిస్తున్నాడు.
ఖతర్నాక్ సైబర్ హ్యాకర్ ఎట్టకేలకు బెంగుళూరులో అరెస్టు అయ్యాడు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కోట్లాది రుపాయల విలువైన బంగారం, వెండిని దోచుకుంటున్నాడు. బెంగళూరు సౌత్ ఈస్ట్ సైబర్ పోలీసుల వలలో సైబర్ హ్యాకర్ చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన సైబర్ హ్యాకర్ లక్ష్మీపతి అలియాస్ పతిని అరెస్ట్ చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు..

రివార్డ్ పాయింట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేస్తున్న నిందితుడు లక్ష్మీపతి వివిధ కంపెనీలు తమ కస్టమర్లకు ఇచ్చిన గిఫ్ట్ వోచర్లను హ్యాక్ చేసి లాభాలను తన ఖాతాలోకి మార్చుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అరెస్టు అయిన నిందితుడు లక్ష్మీపతి నుంచి రూ. 4.16 కోట్ల విలువైన బంగారం, వెండి, 11 లక్షల రూపాయల నగదు, వివిధ బ్రాండ్లకు చెందిన 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.













Click it and Unblock the Notifications