• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!

|

ముంబై: సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన బూడిద రంగు భారీ సూట్ కేసు అది. తీరానికి కొట్టుకుని వచ్చిన కొద్ది సేపటికే వీధి కుక్కలు దాని చుట్టు చేరుకోవడం, భరించలేని దుర్వానస అందులో నుంచి వెలువడటం.. సందర్శకుల్లో కలకలం రేపింది. దగ్గరకు వెళ్లి చూసిన కొందరు సందర్శకులు ఉలిక్కి పడ్డారు. ఆ సూట్ కేసులో నుంచి మనిషి పాదం బయటికి కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బీచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మాస్ సూసైడ్: ఇద్దరు పిల్లలను పొడిచి చంపి, కుటుంబం మొత్తం ఆత్మహత్య: పెంపుడు కుందేలును సైతం.. !

సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా.. అందులో మృతదేహం కనిపించింది.. ముక్కలు ముక్కలుగా నరికిన స్థితిలో. ఆ వెంటనే- క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు దాన్ని సియోన్ లోని ఆసుపత్రికి పంపించారు.

Chopped in parts, packed in suitcase, body floats to Mahim beach in Mumbai, Police launched inquiry

ముంబైలోని ప్రముఖ బీచ్ లల్లో ఒకటైన మాహిమ్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత మఖ్దూం షా బాబా దర్గా సమీపంలో ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన సూట్ కేసులో ఈ మృతదేహం కనిపించింది. రెండు కాళ్లు, ఒక చేతిని శరీరం నుంచి వేరు చేశారు. మర్మాంగాన్ని కత్తిరించి, ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉంచారు. హతుడు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నామని మాహిమ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మిలింద్ గదంకుష్ తెలిపారు.

మృతదేహం ఫొటోను ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించనున్నట్లు చెప్పారు. రెండు వారాల వ్యవధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని అన్నారు. వాటి ద్వారా హతుడు ఎవరనే విషయాన్ని నిర్ధారించగలమని చెప్పారు. హతుడు ఎవరనే విషయం తెలిసిన తరువాతే దర్యాప్తు ముందుకు సాగుతుందని చెప్పారు. హంతకులెవరైనా గానీ.. క్రూరంగా, హింసించి చంపి ఉంటారనే విషయాన్ని మృతదేహాన్ని చూస్తే అర్థమౌతోందని మిలింద్ తెలిపారు.

Chopped in parts, packed in suitcase, body floats to Mahim beach in Mumbai, Police launched inquiry

హత్య చేసిన తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు. మృతదేహంపై గాయాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పారు. మర్మాంగాన్ని సైతం వేరు చేయడం హంతకుడి వికృత మనస్తత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని, ఈ లోగా హతుడు ఎవరనే విషయంపై దర్యాప్తు సాగిస్తున్నామని మిలింద్ వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chopped body parts of an unidentified man have been found stuffed in a suitcase at Mumbai Mahim beach. The suitcase was spotted by some who reported the black suitcase floating on the waters at the Mahim beach near Makhdoom Shah Baba shrine on Monday evening and alerted the police who rushed to the spot and seized the suitcase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more