Church: వీళ్లకు ఏసు ప్రభువు ఏం చేశారు ?, చర్చి డోర్లు పగలగొట్టి జీసస్ విగ్రహాలు, ఊయల, ఫర్నీచర్ !
బెంగళూరు/ మైసూరు: క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రపంచ దేశాల్లో చర్చీల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకున్నారు. భారతదేశంలోని క్రైస్తవులు అందరూ మూడు రోజుల క్రితం చాలా గ్రాండ్ గా క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. అయితే ఓ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి జీసస్ విగ్రహాలు, చర్చిలో ఫర్నీచర్ ద్వంసం చెయ్యడం కలకలం రేపింది. చర్చిలోని విగ్రహాలు, గాజు గ్లాసులు మొత్తం ద్వంసం చేశారు. చర్చి వెనుక వైపు నుంచి నిందితులు లోపలికి వెళ్లారు.

ఉదయం చర్చిలో ప్రార్థనలు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హిరియపట్టణంలోని గోనికొప్ప రోడ్డులోని సెయింట్ మేరీస్ చర్చి ఆవరణలో ఉన్న ఏసు ప్రభువు విగ్రహం, ఫర్నీచర్ ధ్వంసం చేసి మైకులు చోరీ చేసి పరారైనారు. మంగళవారం ఉదయం చర్చిలో ప్రార్థనలు చేసిన ఆ చర్చి ఫాదర్ జాన్ పాల్ పని మీద మైసూరుకు వెళ్లారు. చర్చిలో పనిచేస్తున్న మహిళ సెలవు తీసుకుని కుటుంబ సభ్యులతో గడపడానికి ఊరికి వెళ్లింది.

రాత్రి లైట్లు వెయ్యాలని వెళ్లి చూస్తే ?
మంగళవారం రాత్రి చర్చిలో పని చేస్తున్న మరో వ్యక్తి రాజన్న చర్చిలో లైట్లు వెయ్యడానికి వెళ్లి చూస్తే చర్చి మీద దాడి జరిగటిన విషయంవ వెలుగు చూసింది. నిందితులు చర్చి వెనుక తలుపు తెరిచి లోపలికి వచ్చి ఏసు ప్రభువు విగ్రహాలు, చర్చిలోని పూల కుండీలు పగలగొట్టి వెళ్లారని గుర్తించి వెంటనే చర్చి ఫాదర్ జాన్ పాల్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఏసు ప్రభువు విగ్రహాలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చర్చిలో నిర్మించిన ఊయలతోపాటు ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసి, వేదికపై నుంచి ఏసు క్రీస్తు విగ్రహాన్ని చర్చి ఆవరణంలోకి విసిరేసి వెళ్లిపోయారని రాజన్న పోలీసులకు చెప్పాడు. జీసస్ విగ్రహానికి అమర్చిన గాజు గ్లాస్ కూడా దూరంగా విసిరేశారు. చర్చి బయట నిర్మించిన ఏసుక్రీస్తు విగ్రహం, అక్కడ ఉన్న పూల కుండీలను పగులగొట్టి సమీపంలోని 3 నాణేలను అపహరించి వెళ్లిపోయారు.

చర్చి వెనుక తలుపులు పగలగొట్టి ?
చర్చికి వెనుక వైపు మరోవైపు తలుపులు తీయడానికి ప్రయత్నించిన దుండగులు మరోతలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై చర్చి ఫాదర్ జాన్‌పాల్ హిరియపట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చర్చి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పట్టపగలు చర్చి మీద దాడి జరగడంతో ఆ ప్రాంతంలోని క్రైస్తవ సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications