ఇన్ఫోసిస్‌కు మరో ఇద్దరు గుడ్ బై: సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా
బెంగళూరు: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫీకి రాజీనామా చేయడం గమనార్హం.
సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అబ్దుల్ రజక్, ఎడ్జ్ వేర్వే(ప్లాట్‌ఫామ్స్ సబ్సిడరీ) సీఈవో పెర్విందర్ జోహార్‌లు కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిసింది. కొత్త చైర్మన్ నందన్ నిలేకని సారథ్యంలో కంపెనీలో ఈ పునర్వ్యవస్థీకరణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.

రజక్ కూడా ఎస్‌ఏపీ నుంచి ఇన్ఫోసిస్‌కి వచ్చి చేరిన డజను మంది ఉద్యోగుల్లో ఒకరు. విశాల్ సిక్కా నియామకం తర్వాత ఎస్‌ఏపీలో ఆయన కొలీగ్స్ ఇన్ఫీలో చేరారు. ప్రస్తుతం విశాల్ సిక్కా ఇన్ఫీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో, ఆయనతో పాటు కంపెనీలోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేస్తున్నారు. రజక్ నెలక్రితమే రాజీనామా పత్రాలను సమర్పించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications