చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CI wife: నెల ముందు స్వీటి మాయం, పట్టించుకోని సీఐ, ఆ ఇంట్లో అస్తిపంజరం, ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/ వడోదర/ చెన్నై: పోలీస్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న అధికారి భార్య మాయం అయ్యి 40 రోజులకు పైగా అవుతోంది. తన భార్య కనపడకుండా పోయింది అని సాటి పోలీసు అధికారులకు లేటుగా ఫిర్యాదు చేసిన ఆ ఇన్స్ పెక్టర్ తాపీగా ఉంటున్నాడు. భార్య కనపడటం లేదని కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఆ ఇన్స్ పెక్టర్ తిరగడంతో సాటి పోలీసులకు అతని మీద అనుమానం వచ్చింది. ఇదే సమయంలో పాడుపడిన ఇంటిలో అస్తిపంజరం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. అదే ఇంటిలో చిక్కిన కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడుపడిన ఇంటిలోని అస్తిపంజరం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మాయం అయిన ఇన్స్ పెక్టర్ కూతురు రక్తనమూనాలు సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. మహిళ మాయం అయిన కేసులో ఇప్పుడు ఆమె శవం కూడా చిక్కకుండా పోలీసు తెలివి చూపించాడని ఆ పోలీస్ ఇన్స్ పెక్టర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం కలకలం రేపుతోంది.

Khiladi wife: చిత్రాకు భర్త, ముగ్గురు సీక్రెట్ ప్రియులు, ఒకడిని కోసి కారం పెట్టేసింది, ఏడాదికి !Khiladi wife: చిత్రాకు భర్త, ముగ్గురు సీక్రెట్ ప్రియులు, ఒకడిని కోసి కారం పెట్టేసింది, ఏడాదికి !

 పోలీస్ ఇన్స్ పెక్టర్

పోలీస్ ఇన్స్ పెక్టర్

గుజరాత్ లోని వడోదర సమీపంలోని కర్జోన్ లో పోలీస్ ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ నివాసం ఉంటున్నాడు. ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ భార్య స్వీటి (37). భార్య స్వీటీ, 2 సంవత్సరాల కూతురితో కలిసి అజయ్ దేశాయ్ సంతోషంగానే ఉంటున్నాడని సమాచారం. పోలీసు అధికారిగా ఉద్యోగం చేస్తుండటంతో అజయ్ దేశాయ్ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లి వస్తున్నాడు.

 మాయం అయిన స్వీటి

మాయం అయిన స్వీటి

జూన్ 5వ తేదీ నుంచి స్వీటి కనపడటం లేదు. స్వీటి పుట్టింటిలో, బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా స్వీటి ఆచూకి చిక్కడం లేదని ఇన్స్ పెక్టర్ అజయ్ కుమార్ సాటి పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి స్వీటి కోసం గాలిస్తున్నారు. పోలీసులు గాలిస్తున్నా స్వీటి ఆచూకి మాత్రం ఇంతవరకు చిక్కలేదు.

 పాడుపడిన ఇంటిలో అస్తిపంజరం

పాడుపడిన ఇంటిలో అస్తిపంజరం

వడోదరకూ 40 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ అటాలి గ్రామం సమీపంలోని ఒకపాడుపడిన ఇంటిలో అస్తిపంజరం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వడోదర పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అదే ఇంటిలో చిక్కిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సూరత్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అస్తిపంజరంలోని ఎముకలు మానవుడివే అని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది.

 భార్య స్వీటి గురించి ఏమాత్రం పట్టించుకోని సీఐ

భార్య స్వీటి గురించి ఏమాత్రం పట్టించుకోని సీఐ

పోలీసు అధికారి అజయ్ దేశాయ్ ఆయన భార్య స్వీటి మాయం అయ్యి 40 రోజులకు పైగా అవుతోంది. తన భార్య స్వీటి కనపడకుండా పోయిందని సాటి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ తాపీగా ఉంటున్నాడు. భార్య స్వీటి కనపడటం లేదని కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ తిరగడంతో సాటి పోలీసులకు అతని మీద అనుమానం వచ్చింది.

 కూతురికి డీఎన్ఏ పరీక్షలు

కూతురికి డీఎన్ఏ పరీక్షలు

గుజరాత్ స్పెషల్ ఆపరేషన్ విభాగం ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ కూతురు ( 2 సంవత్సరాలు) రక్తనమూనాలు సేకరించిన పోలీసులు పాడుపడిన ఇంటిలో చిక్కిన అస్తిపంజరం ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. సీఐ భార్య స్వీటి మాయం అయ్యిందని ఆమె సోదరుడు కర్జోన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు పెట్టారు.

 పోలీసు బుద్ది చూపించాడా ?

పోలీసు బుద్ది చూపించాడా ?

భార్య స్వీటిని ఆమె భర్త అజయ్ దేశాయ్ చంపేసి శవం కూడా చిక్కకుండా పోలీసు బుద్ది ఏమైనా చూపించాడా ? అనే అనుమానాలు ఉన్నాయని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వడోదర ఎస్పీ సుధీర్ కుమార్ దేశాయ్ అంటున్నారు. స్వీటి మాయం అయిన కేసులో ఇప్పుడు ఆమె శవం కూడా చిక్కకుండా పోలీసు తెలిపి చూపించాడని ఆ పోలీస్ ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం కలకలం రేపుతోంది.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

అజయ్ దేశాయ్, స్వీటి నివాసం ఉంటున్న కర్జోన్ లోని ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని, జూన్ 5వ తేదీన స్వీటి ఒంటరిగా బయటకు వెళ్లినట్లు ఎక్కడా కనించడం లేదని ఎస్పీ సుధీర్ కుమార్ దేశాయ్ అంటున్నారు. 2015లో అజయ్ దేశాయ్, స్వీటి వివాహం అయ్యిందని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. స్వీటిని ఆమె భర్త ఇన్స్ పెక్టర్ అజయ్ దేశాయ్ హత్య చేసి శవం చిక్కకుండా మాయం చేసి ఉంటాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని స్థానిక మీడియా అంటోంది. అక్రమ సంబంధం కారణంగా ఏమైనా స్వీటి హత్యకు గురైయ్యిందా, అజయ్ దేశాయ్ కు ఏమైనా అక్రమ సంబంధం ఉందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Gujarat: Forty days after his wife went missing under mysterious circumstances, police inspector Ajay Desai is now being considered a suspect by the investigators in Vadodara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X