'శిక్ష పడుతోందనే అధికారం కోసం ఇలా..శశికళపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు'
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో సినీ నటుడు కమల్ స్పందించారు.శశికళపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటుడు కమల్ హసన్ మరో సారి స్పందించారు. అన్నాడిఎంకె చీఫ్ శశికళను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా కమల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాలపై కమల్ హసన్ తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత కమల్ హసన్ ప్రశంసలు గుప్పించారు.అధికారం చేపట్టడంపై రెండు రకాల అభిప్రాయాలనుఆయన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ రెండు సూక్తులను కూడ ఆయన ఉటంకించారు.

"శిక్ష పడుతోందనే భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్గడం...మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో) " అని ఆయన ట్వీట్ చేశారు.
"ఖచ్ఛితంగా తమిళనాడులో ఇదే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. " కమల్ హసన్ అభిప్రాయాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.కమల్ నిర్భయంగా తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన ఘాటుగానే స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications