రూ. 30 కోట్ల ఆస్తి ఉన్నా... ప్రాణాల్ని కాపాడుకోలేక పోయింది

న్యూఢిల్లీ: ముంబై మహానగరంలో రూ. 30 కోట్లకు పైగా ఆస్తి ఉండి 68 ఏళ్ల వృద్ధురాలు అనాథగా చనిపోవడంతో హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు... వృద్ధులకు తగిన సంక్షేమ పథకాలు కల్పించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని తప్పుబట్టింది.

ఇంట్లో వారు వృద్ధులను చూడపోయినా వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. సీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం వృద్ధులకు వైద్య సదుపాయాలతో పాటు, వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొంది.

వివరాల్లోకి వెళితే... జయశ్రీ ఘోల్కర్ (68) అనే వృద్ధురాలికి వెర్సినోవాలోని యారీ రోడ్డులో రూ. 30 కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఆ వృద్ధురాలి సోదరుల్లో ఒకరు ఆమె నివసిస్తున్న బంగ్లాకు పక్కనే ఉంటున్నాడు. మరో సోదరుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు.

City woman worth Rs 30 crore dies of neglect, HC lambasts state

కాలం కలిసిరాక ఆ వృద్ధురాలిని ఇంట్లో వాళ్లు బయటకు నెట్టివేశారు. దగ్గర్లో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న సారా ఆమె దయనీయ దుస్ధితిని చూసి దగ్గరకు తీసింది. ఆమె చనిపోయే వరకు ఆమెతో ఉంది. ఆమె దయనీయ పరిస్ధితిపై బాంబే హైకోర్టుకి వివరించింది.

జనవరి ఏడో తేదీన బాంబే హైకోర్టు ఆదేశాలతో జేజే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని డివిజన్ బెంచ్ జస్టిస్ విఎమ్ కర్నాడే, రేవతి మోహితి ఆదేశించారు. అప్పటికే ఆమె పరిస్ధితి విషమించడంతో రెండు రోజుల క్రితం చనిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+