జనవరి 1న ఆడపిల్ల పుడితే బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నూతన సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురిపిస్తున్నారు.

డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత జన్మించే ఆడపిల్లకు రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె మేయర్‌ సంపత్‌ రాజ్‌ ప్రకటించారు. ఆ చిన్నారి పేరు, బీబీఎంపీ కమిషనర్‌ పేరుతో జాయింట్ బ్యాంక్ ఖాతా తెరిచి ఆ ఐదు లక్షల రూపాయల నగదు డిపాజిట్‌ చేస్తామని సంపత్ రాజ్ తెలిపారు.

Civic body announces Rs 5 lakh incentive for girl child born on New Year in Bengaluru

ఆడపిల్లకు 18 ఏళ్లు పూర్తి అయిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం రూ. 5 లక్షలు వినియోగించుకోవచ్చని బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె మేయర్ సంపత్ రాజ్ చెప్పారు. సాధారణ ప్రసవం ద్వారా జన్మించే ఆడపిల్లకు మాత్రమే రూ. 5 లక్షలు ఇస్తామని మేయర్ సంపత్ రాజ్ స్పష్టం చేశారు. తమిళనాడులో జన్మించి బెంగళూరు మేయర్ అయిన సంతప్ రాజ్ ఆడపిల్లల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఇలాంటి పథకాలు ప్రవేశ పెడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) has announce a cash incentive scheme for girl child born on January 1 at the civic body-run hospitals through normal delivery procedure. According to the reports, the BBMP will deposit Rs five lakh into a joint account whose beneficiary would by the girl child.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి