• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీజేఐ రమణ మరో సంచలనం -కరోనా వేళ ప్రత్యేక యాప్ -త్వరలో సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌ స్ట్రీమింగ్

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతుండగా, సోషల్ డిస్టెన్స్ నివారణకు ప్రభుత్వాలు ఆదేశాలిస్తున్నాయిగానీ, అది కచ్చితంగా అమలయ్యే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం కొరవడ్డాయి. కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపుతోన్న సుప్రీంకోర్టు, విలయ కాలానికి అనుగుణంగా తన విధానాలనూ సమూలంగా మార్చుకుంటున్నది. ఆక్రమంలోనే సుప్రీం వార్తల కవరేజీ కోసం జర్నలిస్టులు కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా సరికొత్త మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. సీజేఐ ఎన్వీ రమణ గురువారం ఆ యాప్ ను ఆవిష్కరించారు. సుప్రీం చరిత్రలో ఇదొక సంచలన పరిణామంకాగా, అతి త్వరలోనే విచారణల లైవ్ స్ట్రీమింగ్ కూడా తీసుకొస్గామని జస్టిస్ రమణ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

ప్రధాని మోదీ గల్లంతు -పన్నులు, ఫొటోలే మిగిలాయి -అమిత్ షాపై మిస్సింగ్ కేసు నమోదు -కాంగ్రెస్ ఫైర్ప్రధాని మోదీ గల్లంతు -పన్నులు, ఫొటోలే మిగిలాయి -అమిత్ షాపై మిస్సింగ్ కేసు నమోదు -కాంగ్రెస్ ఫైర్

మీడియా కోసం సుప్రీం యాప్

మీడియా కోసం సుప్రీం యాప్

డిజిటల్ మీడియా వ్యాప్తితో కోర్టులకు సంబంధించిన అన్ని వార్తలు ప్రజలకు చేరువ అవుతున్నాయని, కోర్టు తీర్పులు, జడ్జిల వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియాపై ఆంక్షలు విధించలేమని ఇటీవలే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం మీడియా సంస్థల కోసం ప్రత్యేక మోబైల్ యాప్‌ను రూపొందించింది. సీజేఐ ఎన్వీ రమణ ఈ యాప్ ను గురువారం అధికారికంగా ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ ఇంకొన్ని కీలక అంశాలు చెప్పుకొచ్చారు..

వ్యాక్సిన్లపై ఎన్‌టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్వ్యాక్సిన్లపై ఎన్‌టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్

నాడు జర్నలిస్టుగా బాధలు..

నాడు జర్నలిస్టుగా బాధలు..

‘‘సుప్రీంకోర్టులో వ్యవహారాలకు సంబంధించి మీడియా వాళ్లు ఎక్కువగా లాయర్లపైనే ఆధారపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కోర్టు వార్తల సేకరణలో జర్నలిస్టుల కష్టాలు నాకు స్వయంగా తెలుసు. కెరీర్ తొలినాళ్లలో కొంత కాలంపాటు నేనూ జర్నలిస్టుగా పనిచేశాను. అప్పట్లో మాకు కార్లు, బైకులు అందుబాటులో ఉండేవికావు. విషయసేకరణకు, వాటిని ప్రజలకు అందించడానికి ఇబ్బందులుపడేవాళ్లం. సుప్రీం జడ్జిల ఆధ్వర్యంలో తయారైన ఈ యాప్ ద్వారా కోర్టుకు సంబంధించిన తాజా సమాచారం జర్నలిస్టులకు ఎప్పటికప్పుడే లభిస్తుంది. కోర్టు ఆవరణలోకి రాకుండానే మీడియా తన పని తాను చేసుకోవచ్చిక. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు విచారణలు అన్నీ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాం. నా సహచర జడ్జిలతో మాట్లాడి దీనిపై త్వరలోనే స్పష్టమైన ఆదేశాలిస్తాం'' అని సీజేఐ రమణ అన్నారు.

ఆ టీమ్ మొత్తానికీ కరోనా..

ఆ టీమ్ మొత్తానికీ కరోనా..


జర్నలిస్టుల కోసం యాప్ రూపొందించిన సుప్రీంకోర్టు బృంద సభ్యులంతా కరోనా బారినపడ్డారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు సీజేఐ రమణ చెప్పారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్‌ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు.. పారదర్శకంగా ఉండేదుకు గాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావింస్తున్నట్లు, రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు జస్టిస్ రమణ తెలిపారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి సిజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.

English summary
The Supreme Court of India today released a mobile application which will enable journalists to report virtual proceedings without having to visit court premises during the COVID-19 pandemic. Chief Justice of India NV Ramana launched the mobile application at a virtual event. CJI Ramana noted that the judges were informed that journalists were depending on advocates to get links to hearings. CJI Ramana also revealed that he will actively consider live streaming of proceedings for some courts after consulting other Supreme Court judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X