సీజేఐ ఎన్వీ రమణ వారసుడుగా : సిఫార్సు చేయాలంటూ - ఆయనకే ఛాన్స్..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక కానున్నారనే దాని పైన క్లారిటీ వచ్చింది. జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే అంశం పైన కేంద్రం ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి అభిప్రాయం కోరింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ మేరకు సిఫార్సు కోరుతూ లేఖ రాసారు. దీని పైన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశమైంది. ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీ పైన చర్చించింది.

నూతన సీజేఐ ఎంపికపై కసరత్తు
సీజేఐ గా ఎన్వీ రమణ స్థానంలో తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నియామకం దాదాపు ఖరారైంది. ఈ నెల 27న సుప్రీం 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన సీజేఐగా లలిత్ నియామకంకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి సీజేఐ ఎన్వీ రమణ కార్యాలయానికి వర్తమానం అందింది. 2021, ఏప్రిల్ 21న భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా సీజేఐ హోదాలో ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణతో
ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న న్యాయమూర్తుల కేటాయింపు..ఖాళీల భర్తీ..కోర్టులకు మౌళిక వసతుల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సుప్రీం కొలీజయం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ శాఖ.. సీజేఐ అభిప్రాయం పరిగణలోకి తీసుకొని అధికారికంగా నూతన సీజేఐ నియామకం పైన రాష్ట్రపతికి సిఫార్సు చేయనుంది. రాష్ట్రపతి ఆమోదంతో గజెట్ జారీ కానుంది. దాదాపుగా సీజేఐ గా నియమితులయ్యే అవకాశం ఉన్న జస్టిస్ లలిత్ నవంబరు 9, 1957న జన్మించారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

నూతన సీజేఐగా యుయు లలిత్
ట్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యుడిగా ఉన్నారు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా వ్యవహరించిన జస్టిస్ లలిత్..నియామకం అధికారికమైతే ఆయన మూడు నెలల పాటు ఆ హోదాలో పని చేయనున్నారు. లలిత్ నవంబర్ 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.












Click it and Unblock the Notifications