బొద్దింకల వీరవిహారం..! 2 రోజుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచి కీలక నిర్ణయాలు..!
ఈ ఏడాది నీట్ పరీక్ష అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసి, పార్లమెంట్ మార్చ్ చేపట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP).. రెండో దశలో చేపట్టిన మరో ఉద్యమం కూడా విజయవంతంగా మారుతోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల దుస్దితిని ప్రశ్నిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న తనిఖీలు ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలను మొద్దునిద్ర నుంచి లేపుతున్నాయి. కాక్రోచ్ ల ప్రభావంతో తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు ప్రకటించాయి.
CJP Impact! 🔥🔥
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 14, 2026
Yet another win for the students!
But 2814 unsafe structures were still being used across Haryana, putting thousands of children at risk.
Were the lives of poor children a joke for the government until now? pic.twitter.com/FkwtiL56zO
బీజేపీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో పాఠశాలల దుస్దితిపై గత కొన్ని రోజులుగా సీజేపీ పోరాటాలు చేస్తోంది. స్వయంగా తనిఖీలు చేస్తూ సీజేపీ బృందాలు స్థానిక అధికారుల్ని, ప్రభుత్వాలను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో వీరిని ఎలాగైనా ఆపాలని ఆయా ప్రభుత్వాలు స్కూల్స్ కు సెలవులు ఇచ్చేయడం, తాత్కాలికంగా మూసేయడం, సీజేపీ బృందాలను స్కూల్స్ కు వెళ్లకుండా అడ్డుకోవడం చేస్తున్నాయి. అయినా కాక్రోచ్ లు వెనక్కి తగ్గకపోవడంతో చేసేది లేక, ప్రజల్లో పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Ek Dharmendra Pradhan ke resignation se kya hoga? 😄 https://t.co/c5eCWlqrwY
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 15, 2026
ఇందులో భాగంగా శిధిలావస్ధలో ఉన్న 2814 స్కూలు నిర్మాణాలను కూల్చేయాలని హర్యానాలోని నాయబ్ సింగ్ సైనీ సర్కార్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అనంతరం యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ సైతం స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దిపై తాజాగా కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 14429 ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని స్మార్ట్ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.300 కోట్ల బడ్జెట్ ను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హర్యానా, యూపీలో పలు స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ స్కూళ్లలో వరుసగా తనిఖీలు చేపట్టి.. వాటిని మెరుగుపర్చేందుకు సీజేపీ నేతలు టూర్ లు ప్లాన్ చేసుకుంటున్నారు.














Click it and Unblock the Notifications
