ఓ ‘కిలేడీ’ మాయ!: ఐపీఎస్ అధికారిణిగా నమ్మించి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని పెళ్లిచేసుకుని..
కేరళలో ఓ ‘కిలేడీ’ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.
కొట్టాయం: కేరళలో ఓ 'కిలేడీ'ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.
అంతకు ముందు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసింది. ఆ నిరుద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ 'కిలేడీ' మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆ మాయలేడీని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన అఖిల్ మనోహర్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. అతనికి అశ్రిత అనే యువతి పరిచయమైంది. తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌గా అశ్రిత(24) తనను తాను పరిచయం చేసుకుంది.

ఆమెను నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ గా నమ్మి, ఇష్టపడి అఖిల్ మనోహర్ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ వివాహమై కేవలం నెల రోజులు దాటింది అంతే. కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో తన భార్య ఘరానా మోసగత్తె అని అఖిల్ మనోహర్‌కు తెలిసింది.
గతంలో పలక్కడ్‌కు చెందిన సంతి అనే యువకుడి పొరుగింట్లో అశ్రిత నివాసముండేది. అశ్రిత ఐపీఎస్ ఆఫీసర్ అని సంతి కూడా నమ్మేశాడు. అతడికి డ్రైవర్ కమ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తానని చెప్పి అశ్రిత అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది.
ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆమె పత్తా లేకుండా పోవడంతో సంతి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అఖిల్ మనోహర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అశ్రితను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు విజిలెన్స్ శాఖలో పనిచేస్తున్నట్లుగా చెప్పుకుంటూ చలామణీ అవుతున్న అశ్రిత కనీసం వీధి బడి చదువు కూడా పూర్తి చేయలేదని తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. గతంలో కూడా ఆమె ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications