సోదరితో ఇంటికి వెలుతున్న 10వ తరగతి విద్యార్థిని కొట్టి చంపేశారు. వేరే కులం అంటూ !
లక్నో/ప్రయోగరాజ్: ఉత్తరప్రదేశ్ లో నేరాలు,ఘోరాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడాలు లేకుండా వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. నేరస్తులను ఏరిపారేస్తున్నా ఆ రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. పెద్దల వర్గపోరు లాగా ఇప్పుడు స్కూల్ లో రెండు కులాల విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో ఓ విద్యార్థి హత్యకు గురికావడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మరో వర్గానికి చెందిన తోటి విద్యార్థులతో వివాదం తర్వాత 10వ తరగతి విద్యార్థిని దారుణంగా కొట్టి చంపేశారు.సోమవారం 16 ఏళ్ల బాలుడు అదే స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అతని కజిన్ సిస్టర్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెలుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

బాధితుడు, నిందితులు అయిన విద్యార్థులు స్కూల్ లో ఏదో వివాదంపై ఘర్షణ పడ్డారని, అయితే ఆ విషయాన్ని ఉపాధ్యాయులు పరిష్కరించారని తెలిసింది. బాధితుడు అతని సోదరితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో నిందితులు అతని సోదరిని మానసికంగా వేధిస్తూ బూతులతో తిట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్బంలో 10వ తరగతి యువకుడు తన సోదరిపట్లు నీచంగా మాట్లాడుతున్న వారిని ఎదరించాడని తెలిసింది.
ఆ సందర్బంలో నిందితులు అతనిని కొట్టడంతో అతనికి తీవ్రగాయాలైనా అతని మరణానికి దారితీసిందని బాదితుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే అమ్మాయిని వేధింపుల పుకార్లను తప్పుడు ప్రచారం చేశారని, విద్యార్థుల మధ్య జరిగిన వివాదమే ఈ ఘటనకు కారణమని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. స్కూల్ లో విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

దాని తరువాత ఓ విద్యార్థి పెద్ద కర్రతో మరో విద్యార్థిప దాడి చేశాడని, గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంతలో, ఈ సంఘటన స్థానికులలో ఆగ్రహం తెప్పించింది. నిరసనగా రోడ్లను దిగ్బంధించారు. ఆందోళనలు పెరగడంతో భయంతో దుకాణాలు మూతపడ్డాయి. సాయంత్రం వరకు గందరగోళం కొనసాగింది, పోలీసులు సంఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ స్థానికులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications