దారుణం : హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రసవం..

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పతారాస్‌లో ఉన్న ఓ సాంఘీక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు మృత శిశువుకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక హాస్టల్లో ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న డిప్యూటీ కలెక్టర్ వెంటనే హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ సూపరింటెండ్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

బాలికకు జన్మించిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కాఘటనపై బాలిక మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన ఓ యువకుడితో రెండేళ్లుగా తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అతనితో ఏర్పడిన శారీరక సంబంధం కారణంగానే గర్భం దాల్చినట్టు చెప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.

కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని గిరిజన డిగ్రీ కాలేజీ హాస్టల్లో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చడం సంచలనం రేపింది. గత కొద్దిరోజులుగా ఆ విద్యార్థినులకు రుతుక్రమం సరిగా రాకపోవడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. వారు గర్భం దాల్చినట్టు ుతేలింది. హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఉంచిన ఈ విషయం.. ఎట్టకేలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Class 11 student delivers baby in Chhattisgarh schools hostel investigation initiated says deputy collector

గతంలోనూ ఆ హాస్టల్ విద్యార్థిని ఒకరు గర్భం దాల్చారన్న ప్రచారం ఉంది. విద్యార్థినులు గర్భం దాల్చడంపై స్థానిక ఆదివాసీ,గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి చదువు కోసం వచ్చే విద్యార్థినులు గర్భం దాల్చడమేంటని వారు ప్రశ్నించారు. మరోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం వారికి లవ్ ఎఫైర్ ఉండటం వల్లే గర్భం దాల్చారని ఆరోపించారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+